Passport Appointment: పాస్‌పోర్టు దరఖాస్తు పెండింగ్‌లో ఉందా..? క్షణాల్లో పరిష్కరించుకోండి ఇలా..

Appointment Availability Status: పెండింగ్‌లో ఉన్న పాస్‌పోర్ట్ ఫైల్స్‌ను వీలైనంత త్వరగా క్లియర్ చేయడానికి ఘజియాబాద్  ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. పెండింగ్‌లో ఉన్న ఫైళ్ల కోసం దరఖాస్తుదారులకు అపాయింట్‌మెంట్‌లు ఇస్తూ వేగంగా క్లియర్ చేస్తోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2024, 12:36 PM IST
Passport Appointment: పాస్‌పోర్టు దరఖాస్తు పెండింగ్‌లో ఉందా..? క్షణాల్లో పరిష్కరించుకోండి ఇలా..

Appointment Availability Status: పాస్‌పోర్ట్‌లు (Passport Appointment) కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. మీ పాస్‌పోర్ట్ ఫైల్ ప్రభుత్వ కార్యాలయంలో పెండింగ్‌లో ఉంటే.. క్లియర్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఘజియాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం అధికారులు పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను తక్షణమే పరిష్కరిస్తున్నారు. కార్యాలయంలో ఫైళ్లు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులకు వెంటనే అపాయింట్‌మెంట్‌ ఇస్తూ.. వేగంగా క్లియర్ చేస్తున్నారు. పాస్‌పోర్ట్‌ల పెండింగ్ ఫైల్స్‌ (Appointment Availability Status)ను క్లియర్ చేసేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. 

దరఖాస్తుదారుల పెండింగ్ ఫైళ్ల పరిష్కారానికి సోషల్ మీడియా, ఈమెయిల్ తదితరాల ద్వారా సమాచారం అందజేస్తోంది. ఎంక్వైరీకి అపాయింట్‌మెంట్ లేని దరఖాస్తుదారుల సమస్యను వెంటనే వాక్-ఇన్ అపాయింట్‌మెంట్ ఇచ్చి అధికారులు పరిష్కరిస్తున్నారు. దరఖాస్తుదారులు వెంటనే కార్యాలయానికి చేరుకుని.. వారి పెండింగ్‌లో ఉన్న పాస్‌పోర్ట్‌ను వీలైనంత త్వరగా పొందడానికి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. 

పాస్‌పోర్ట్ కార్యాలయ అధికారి ఐఎఫ్‌ఎస్ అనూజ్ స్వరూప్ కొత్త సంవత్సరంలో మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రజలకు పాస్‌పోర్ట్‌కు సంబంధించిన సరైన సమాచారాన్ని అందించడానికి, వారి సమస్యలను పరిష్కరించే అంశాలపై చర్చించారు. కార్యాలయం పేరుతో ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి.. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం.. 2023లో ఘజియాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి 3,54,500 పాస్‌పోర్ట్‌లు, పీసీసీలు జారీ చేశారు. ఈ సంఖ్యను మరింత పెంచి.. తక్కువ సమయంలోనే పాస్‌పోర్ట్ సంబంధిత సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి అనుజ్ స్వరూప్ సూచించారు.

Also read: Makar Sankranti 2024: మకర సంక్రాంతి నుంచి ఈ రాశుల వారికి కొత్త జీవితం ప్రారంభం..ఆస్తులు, డబ్బు రెట్టింపు..

Also read: Yash: యాష్ పుట్టినరోజు తీవ్ర విషాదం.. ముగ్గురు అభిమానులు మృతి 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News