ఆసియా కప్ 2018 కోసం నేడు భారత్ vs బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనున్న అంతిమ సమరానికి సర్వం సిద్ధమైంది. ఇంకొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టేన్ రోహిత్ శర్మ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దుబాయ్‌లోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
7.3 ఓవర్లు ముగిసే సమయానికి ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 42 పరుగులు చేసిన బంగ్లాదేశ్ జట్టు.. భారత్‌కి తొలి దశలోనే సవాల్ విసిరింది. ఓపెనర్లుగా దిగిన లితన్ దాస్ 24 బంతుల్లో 34 పరుగులు(4 x 4, 6 x 1), మెహిదీ హసన్ 20 బంతుల్లో 12 పరుగులు(4 x 2) చేసి క్రీజులో నిలకడగా ఆడుతున్నారు.
టీమిండియా జట్టు ఆటగాళ్లు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధవన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తిక్, ఎం.ఎస్. ధోని (వికెట్ కీపర్), కేదాక్ జాదవ్, రవింద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, మనీష్ పాండే, సిద్ధార్థ్ కౌల్, కేఎల్ రాహుల్, దీపక్ చాహర్.
బంగ్లాదేశ్ జట్టు ఆటగాళ్లు:
మష్రాఫె బిన్ మొర్తాజ (కెప్టేన్), షకీబ్ అల్ హసన్, తమీమ్ ఇక్బాల్, మొహమ్మద్ మిథున్, లితన్ కుమార్ దాస్, ముష్ఫిఖుర్ రహీం, అరిఫుల్ హఖీ, మహ్మదుల్లా, మొసద్దిక్ హుస్సేన్ సైకత్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, మెహిది హసన్ మిరాజ్, నజ్ముల్ ఇస్లాం అపు, రుబేల్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, అబు హైదర్ రోని.