Saindhav OTT Release: ఆ రెండు ఓటీటీల్లోకి వెంకటేష్ 'సైంధవ్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Saindhav OTT: సీనియర్ హీరో వెంకటేష్ నయా మూవీ సైంధవ్. జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీ హక్కుల గురించి నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2024, 12:52 PM IST
Saindhav OTT Release: ఆ రెండు ఓటీటీల్లోకి వెంకటేష్ 'సైంధవ్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Saindhav OTT Streaming Partner and date fix: విక్టరీ వెంకటేష్ 'సైంధవ్' మూవీతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ పడ్డాయి. థియేటర్లలో రిలీజైనప్పటి నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది వెంకీ మూవీ. వెంకటేష్ 75వ చిత్రం కావడం, పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవ్వడంతో ఈ సినిమాపై వీర లెవల్లో అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఈ మూవీ టీజర్, పాటలు, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సైంధవ్ అద్భుతంగా ఉంటుందని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. 

అయితే సైంధవ్ డిజిటల్ హక్కులకు కోసం చాలా ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయి. అయితే చివరకు భారీ ధర వెచ్చించి సైంధవ్ డిజిటల్ రైట్స్ ను దక్కించుకుందట అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ. ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ తర్వాత నాలుగు వారాలకు ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని ఫిబ్రవరి రెండో వారంలో మహాశివరాత్రి సందర్భంగా లేదా మార్చిలో ఓటీటీ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే అమెజాన్ ప్రైమ్‌తో పాటు సైంధవ్ ఓటీటీ హక్కులను ఈటీవీ విన్ కూడా దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫ్లాట్ ఫామ్ లో 45 రోజుల తర్వాత స్ట్రీమింగ్ కు రానున్నట్లు సమాచారం. 

సైంధవ్ మూవీకి శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. వెంకీకి జోడిగా శ్రద్ధ శ్రీనాథ్ నటించింది. ఇందులో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్‌గా నటించాడు. ఈ చిత్రంలో తమిళ హీరో ఆర్య, ఆండ్రియా జెరెమియా, హీరోయిన్ రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్, జిషు సేన్‌గుప్తా, ముకేష్ రిషి, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. సైంధవ్ మూవీకి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించారు. ఈ మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు.

Also Read: Guntur Kaaram: యూఎస్ లో గుంటూరు కారంని దాటిన హనుమాన్.. గెలిచిన కథ.. ఓడిన స్టార్ డమ్

Also Read: Nagarjuna:మాల్దీవ్స్ కి టికెట్లు రద్దుచేసుకున్న నాగార్జున.. మోడీకి సపోర్ట్ వ్యక్తంచేసిన హీరో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News