Mangal Uday 2024: ధనుస్సు రాశిలో ఉదయించబోతున్న కుజుడు.. ఈరాశులపై తీవ్ర ప్రభావం..

Mars Rise 2024: గ్రహాల కాలానుగుణంగా రాశులను మారుస్తాయి. కనుమ రోజు అంగారకుడి గమనంలో పెను మార్పు రాబోతుంది. కుజుడు ఉదయించడం వల్ల ఏ రాశులవారు లాభపడతారో, ఏ రాశులవారు నష్టపోతారో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 14, 2024, 01:43 PM IST
Mangal Uday 2024: ధనుస్సు రాశిలో ఉదయించబోతున్న కుజుడు.. ఈరాశులపై తీవ్ర ప్రభావం..

Mangal Uday in January 2024: జ్యోతిష్యశాస్త్రంలో అంగారకుడిని గ్రహాల కమాండర్ అని పిలుస్తారు. కుజుడు జనవరి 16, 2024న 23:07కి ధనుస్సు రాశిలో ఉదయించబోతున్నాడు. అంగారకుడు పెరుగుదల మెుత్తం 12 రాశులవారిపై సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. ధనస్సు రాశిలో కుజుడు ఉదయించడం నాలుగు రాశులవారిపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

సింహరాశి 
ధనుస్సు రాశిలో అంగారకుడి సంచారం వల్ల మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. ఉద్యోగులకు ఎంతో కాలం ఎదురుచూస్తున్న ప్రమోషన్ వస్తుంది. ఈ సమయంలో అదృష్టం మీ వెంటే ఉంటుంది.  మీ దారిద్ర్యం తొలగిపోతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. 
మేషరాశి
ధనుస్సు రాశిలో అంగారకుడి సంచారం వల్ల మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. విదేశాల్లో ఉద్యోగం సాధించాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. జాబ్ మారడానికి ఇదే మంచి సమయం. నిరుద్యోగులకు పద్ద ప్యాకేజీతో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫం లభిస్తుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. 
కర్కాటక రాశి
కుజుడు సంచారం కర్కాటక రాశి వారికి ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది. మీకు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులు భారీగా నష్టపోతారు. మీకు కెరీర్ లో అనేక సవాళ్లు ఎదురవుతాయి. మీరు ఏ పని చేపట్టినా అది సక్సెస్ అవ్వదు. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. 

Also Read: Makar Sankranti 2024: రేపే మకర సంక్రాంతి... శుభ ముహూర్తం, పూజా విధానం మరియు ప్రాముఖ్యత తెలుసుకోండి..

మకరరాశి
ధనుస్సు రాశిలో కుజుడు పెరగడం వల్ల మీరు మిశ్రమ ఫలితాలను పొందుతారు. విదేశాల్లో పనిచేయాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీ కోరికలు నెరవేరుతాయి. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీరు రుణ ఊబిలో కూరుకుపోతారు. 

Also read: Sankranthi Muggulu: సంక్రాంతి రోజు ముగ్గులు పెట్టుకోకుంటే ఏం జరుగుతుందో తెలుసా? పురాణాలు చెబుతున్నవి ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News