Makar Sankranti 2024 Date and Shubh Muhurat: హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలో సంక్రాంతి ఒకటి. ముఖ్యంగా ఈ ఫెస్టివల్ తెలుగు లోగిళ్లలో చాలా వైభవంగా జరుపుకుంటారు. ఏపీలో అయితే ఈ పండుగ ఓ రేంజ్ లో చేసుకుంటారు. ఈ సమయంలోనే సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరం వైపు ప్రయాణం ప్రారంభిస్తాడు. ఈ పండుగ జనవరి 15, సోమవారం నాడు జరుపుకోనున్నారు.
సంక్రాంతి శుభ ముహూర్తం
సూర్యుడు జనవరి 14న తెల్లవారుజామున 2:54 గంటలకు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. పూజకు అనుకూల సమయం ఉదయం 7:15 నుండి సాయంత్రం 5:46 వరకు. అయితే అత్యంత పవిత్రమైన ముహూర్తం ఉదయం 7:15 నుండి 9:00 వరకు ఉంటుంది.
పూజా విధానం
ఈరోజున ఇంటి మెుత్తాన్ని సర్వాగం సుందరంగా అలకరిస్తారు. అందరు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాలు ఆచరించి కొత్త బట్టలు ధరిస్తారు. ఈ శుభధినాన పూజగదిలో దేవతల ఫోటోలతోపాటు పూర్వీకులు ఫోటోలను కూడా ఉంచి పూజలు చేస్తారు. పండ్లు, స్వీట్స్ తోపాటు పిండి వంటలను కూడా నైవేద్యంగా పెడతారు. మంత్రాలు పఠిస్తూ దేవతారాధన చేస్తారు. ఈ పండుగను ముఖ్యంగా రైతులు జరుపుకుంటారు.
గాయత్రీ మంత్రం:
"ఓం భూర్భువః స్వాః
తత్సవితుర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి
ధియో యో నః ప్రచోదయాత్.”
మకర సంక్రాంతి ప్రత్యేక మంత్రం:
"ఓం గ్రిన్ గ్రిన్ గ్రిన్ శ్రీ శ్రీ శ్రీ శ్రీ మకర సంక్రాంతి దేవతాయై స్వాహా."
సూర్య మంత్రం:
"ఓం హ్రాం హ్రీం హ్రాం సః సూర్యాయ నమః."
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook