Pawan Kalyan Fan Letter: ఐర్లాండ్ నుంచి ఓ అభిమాని రాసిన లేఖకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ఆ ఉత్తరం చదివిన వెంటనే గొంతు దుఃఖంతో పూడుకుపోయిందన్నారు. కన్నీరు తెప్పించావంటూ ఆ లేఖను ట్వీట్ చేశారు. "ఐర్లాండ్ దేశంలో ‘ఓడ కళాసీకి’గా పనిచేస్తున్న నా ప్రియమైన జనసైనికుడికి.. నీ ఉత్తరం అందింది, చదివిన వెంటనే, గొంతు దుఃఖంతో పూడుకుపోయింది.. కన్నీరు తెప్పించావు.. కార్యోన్ముఖుడిని చేసావు.." అంటూ పవన్ కళ్యాణ రాసుకొచ్చారు. గతేడాది డిసెంబర్ 19న ఐర్లాండ్ నుంచి అభిమాని ఉత్తరం రాయగా.. తాజాగా అది పవన్‌కు చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ లేఖలో ఏముందంటే..
"అన్న కష్టాలు, కన్నీళ్లు, రుణాలు, దారుణాలు కారణాలుగా చూపిస్తూ నా దేశాన్ని వదిలి విదేశాల్లో అవమానాల్లో ఆనందాలను వెతుక్కుని నాలాంటి వాళ్ళందరికో ఒక్కటే నీ మీద ఆశ..! ఎక్కడో బొలీవీయా అడవుల్లో అంతమైపోయింది అనుకున్న విప్లవానికి కొత్త రూపాన్ని ఒకటి కనిపెట్టకపోతావా..? సరికొత్త గెరిల్లా వార్ ఫెయిర్‌ను మొదలెట్టక పోతావా..? మన దేశాన్ని కనీసం మన రాష్ట్రాన్ని మార్చుకోకపోతామా..? 17 ఏళ్లుగా ఈ దేశంలో లేకపోయినా దేశం మీద ప్రేమతో భారత పౌరసత్వాన్ని వదులుకోలేక ఎదురుచూస్తున్న నాలాంటి వారందరం మా కోసం నిలబడుతున్న నీకోసం బలపడతాం..
2014 - నిలబడ్డాం
2019 - బలపడ్డాం
2024 - బలంగా కలబడదాం
కారు మీదేక్కేటప్పుడు జాగ్రత్త అన్నా, కారుకూతల్ని పట్టించుకోకు అన్నా, కారుమబ్బులు కమ్ముతున్న వేళ కార్యోన్ముఖుడివై సాగుతున్న వెళుతున్న నీకు ఆ మహాశక్తి అండగా ఉంటుందన్నా.. పవర్ స్టార్ వే కదా అన్నా.. Common man protection force ని ప్రకటించినప్పుడే నిన్ను హీరోగా చూడటం మానేశాను. నువ్వు రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపించే నాయకుడివి.. ఇట్లు.. ఐర్లాండ్ నుంచి ఒక ఓడ కళాసీ" అంటూ లేఖలో ఆ అభిమాని రాసుకొచ్చాడు.
ఐర్లాండ్ దేశం లో ‘ఓడ కళాసీకి’ గా పనిచేస్తున్నా నా ప్రియమైన జనసైనికుడికి, నీ ఉత్తరం అందింది, చదివిన వెంటనే,
గొంతు దుఃఖంతో పూడుకుపోయింది.. కన్నీరు తెప్పించావు..
కార్యోన్ముఖుడిని చేసావు.. 🙏 pic.twitter.com/XhbSYQ1Y6D— Pawan Kalyan (@PawanKalyan) January 17, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter