CM Revanth Reddy: తెలగాణకు భారీ పెట్టుబడులు.. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి: అజారుద్దీన్

Telangana Investments in Davos Summit: దావోస్‌లో తెలంగాణకు వస్తున్న భారీ పెట్టుబడులతో రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని మాజీ ఎంపీ అజారుద్దీన్ అన్నారు. ఆరు గ్యారంటీల అమలుతోపాటు పెట్టుబడుల ఆకర్షించడంలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2024, 02:31 PM IST
CM Revanth Reddy: తెలగాణకు భారీ పెట్టుబడులు.. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి: అజారుద్దీన్

Telangana Investments in Davos Summit: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల అమలుకు నిర్ణయం తీసుకున్నారు. వంద రోజుల్లోనే అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు స్వీకరించిన అధికారులు.. ప్రస్తుతం వాటిని పరిశీలిస్తున్నారు. తాజాగా దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే బృందం తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. 

ఈ సందర్బంగా మాజీ ఎంపీ, టీపీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. మహమ్మద్ అజహారుద్దీన్ విద్యుదుత్పత్తి, బ్యాటరీ సెల్ తయారు చేయడానికి ఆదానీ, గోద్రెజ్, JSW, గోది, వెబ్‌వర్క్స్, ఆరా జెన్ లాంటి సంస్థలతో సుమారు రూ.37,870 కోట్ల పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందన్నారు. ఈ పెట్టుబడులతో తెలంగాణ యువతకు ఉపాధి కల్పించడం కోసం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. యువతకు నైపుణ్య విశ్వవిద్యాలయం స్థాపించడం కోసం ఆదానీ ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. 

ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువతకు ఉపాధికల్పన కోసం పబ్లిక్, ప్రైవేట్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పారు. ఇప్పటికే ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలను అమలు చేశారని గుర్తు చేశారు. మరో రెండు నెలల్లో మిగతా నాలుగు గ్యారెంటీలను కూడా అమలు చేస్తారని అన్నారు. హామీల అమలుతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక సీట్లను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల కోసం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో దాదాపు కోటి 20 లక్షలకు పైగా వినతులు వచ్చాయన్నారు. వాటినన్నింటినీ కంప్యూటీరకరణ చేసి.. ప్రతి సమస్యను పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు.

తెలంగాణలో అత్యధికంగా ఎంపీ సీట్లు గెలిచి.. కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు అహర్నిషలు కృషి చేస్తామన్నారు అజారుద్దీన్. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్, రైతు భరోసా, 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ కోసం గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 

Also Read: Rat found in Online Food: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్.. చచ్చిన ఎలుకను తిన్న యువకుడు 

Also Read: Upcoming Best OLED TVs 2024: Samsung, LGకి షాక్‌..డెడ్‌ చీప్‌ ధరకే AI ప్రాసెసర్‌తో మార్కెట్‌లోకి Panasonic OLED టీవీలు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x