Ram Mandir inaugration: దేశమంతత జనవరి 22 కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తోంది. అందుకు కారణం జనవరి 22న సోమవారం అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ వేడుక ఉండటం.
ఈ కార్యక్రమం దృష్ట్యా సోమవారం కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సగం రోజుల సెలవును ప్రకటించింది.
దీని కారణంగా దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలు, అన్ని ఆర్థిక సంస్థలు అరరోజు పాటు మూతపడనున్నాయి.
ఇలా ప్రభుత్వ కార్యాలయాలు జనవరి 22న హఫ్ డే మాత్రమే పని పనిచేయడం వల్ల ఈ సోమవారం మాత్రం 2000 రూపాయల నోట్లను మార్చుకునే సౌకర్యం ఉండదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలియజేసింది.
ఆర్బీఐ ఇదే విషయంపై అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకుల మాదిరిగానే, రిజర్వ్ బ్యాంక్ 19 స్థానిక కార్యాలయాలకు సగం రోజుల సెలవు ఉంటుందని తెలిపింది. ‘ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున వినియోగదారులు రూ.2000 నోట్లను మార్చుకోలేరు. ఈ సదుపాయం జనవరి 23, 2024 నుండి సాధారణంగా ప్రారంభమవుతుంది,’అని తెలియజేశారు.
మే 19,2023 న రూ.2000 నోట్లను చెలామణి నుంచి తొలగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఈ వార్త ప్రకటించిన సమయంలో రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణిలో ఉండగా, డిసెంబర్ 29, 2023 నాటికి రూ.9,330 కోట్లకు తగ్గింది. ఈ నోట్లను బ్యాంకులో మార్చుకోగలిగే తేదీని డిసెంబర్ చివరి పొడిగించగా, ఈ సంవత్సరం మొదటివారం సర్వే ప్రకారం ఇంకా మొత్తం 2.62 శాతం రూ. 2000 నోట్లు ఉన్నాయి. అవి ఇప్పటికీ బ్యాంకు చెలామణిలో లేవు. కావున మళ్లీ కొద్ది రోజులపాటు ఈ నోట్లన్నీ మార్చుకోగలిగే సౌకర్యాన్ని ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ కాలంలో ఎవరైనా నోట్లను మార్చుకోవడంలో విఫలమైతే, అతను 19 ప్రదేశాలలో ఉన్న రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాలను సందర్శించడం ద్వారా నోట్లను మార్చుకోవచ్చు. న్యూఢిల్లీ, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, కాన్పూర్, కోల్‌కతా, తిరువనంతపురం, నాగ్‌పూర్ గౌహతి, జమ్ము, పాట్నా, లక్నో, ముంబై, భోపాల్, జైపూర్, చండీగఢ్, అహ్మదాబాద్, హైదరాబాద్, వంటి ఆర్‌బీఐ కార్యాలయాల్లో నోట్ల మార్పిడి సౌకర్యం అందుబాటులో ఉంది.
Also Read: Shoaib Malik Third Marriage: సానియా మీర్జాకు భారీ షాక్.. మళ్లీ పెళ్లి చేసుకున్న భర్త షోయబ్ మాలిక్
Also Read: TANA Elections: సంచలనం రేపిన 'తానా' ఎన్నికల్లో కొడాలి నరేన్ జయభేరి.. విజేతలు ఎవరెవరంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter