Rajinikanth and Dhanush leave for Ayodhya to attend Ram Mandir Inaguration: అయోధ్యలో రేపు (సోమవారం) శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగనుంది. ఈ వేడుకకు హాజరయ్యేందుకు దేశవ్యాప్తంగా ప్రముఖులు రెడీ అవుతున్నారు. కొంత మంది సెలబ్రిటీలు అయితే ఒక్క రోజు ముందుగానే అయోధ్యకు వెళ్లనున్నారు. తాజాగా సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్, ధనుష్, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ అయోధ్యకు బయలుదేరారు. చెన్నై విమానాశ్రయం నుంచి రజనీకాంత్, ధనుష్ అయోధ్యకు బయలుదేరిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కెర్లు కొడుతోంది. గ్రీన్ టీషర్ట్‌తో ఎయిర్ పోర్టు లోపలకి ప్రవేశించిన రజినీ.. అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లారు. బ్లూ డ్రెస్సులో ఎయిర్ పోర్టులోకి ఎంటర్ అయిన ధనుష్ సైలెంట్ గా వెళ్లిపోయాడు.
బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ముంబై నుండి అయోధ్యకు బయలుదేరాడు. ఈ హీరోతో అభిమానులు సెల్ఫీలు తీసుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇప్పటికే అయోధ్యలో ఉన్నారు. అంతేకాకుండా రేపు జరగబోయే ప్రాణప్రతిష్ఠ వేడుకకు ముందు జరిగే మతపరమైన కార్యక్రమాలలో ఆమె పాల్గొంది. అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయ ప్రాంగణాన్ని ఊడ్చింది. చిరంజీవి, రామ్ చరణ్, ప్రభాస్, అక్షయ్ కుమార్, అనుష్క శర్మ, విరాట్ కోహ్లి, అలియా భట్, రణబీర్ కపూర్, జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్ వంటి ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు వీఐపీలు రేపు హాజరు కానున్నారు. కొంతమంది సెలబ్రిటీలు ముందస్తు కమిట్‌మెంట్‌ల కారణంగా ఈ వేడుకకు వెళ్లలేకపోతున్నారు.
#WATCH | Chennai, Tamil Nadu: Actors Rajinikanth and Dhanush leave for Ayodhya to attend the Pran Pratishtha ceremony tomorrow. pic.twitter.com/emB7QkP7gy
— ANI (@ANI) January 21, 2024
#WATCH | Uttar Pradesh: Actress Kangana Ranaut participates in cleanliness drive at Hanuman Garhi Temple in Ayodhya.
She is in Ayodhya to attend the Pran Pratishtha ceremony tomorrow. pic.twitter.com/LpElT3ROdf
— ANI (@ANI) January 21, 2024
Also Read: Ayodhya Holiday: అయోధ్య ఆలయంపై డీకే శివ కుమార్ సంచలన వ్యాఖ్యలు
Also Read: Suryavanshi Thakur: ఐదు వందల ఏళ్ల తర్వాత నెరవేరిన శపథం.. పట్టువదలని సూర్యవంశి ఠాకూర్ వంశీయులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Ayodhya temple: అయోధ్యకు క్యూ కడుతున్న సెలబ్రిటీలు, ఎవరెవరు వెళ్లారంటే..