Jee Mains 2024 Exams: రేపట్నించే జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ పరీక్షలు, అడ్మిట్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Jee Mains 2024 Exams: దేశవ్యాప్తంగా నిర్వహించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జేఈఈమెయిన్స్ సెషన్ 1 పరీక్షలు రేపట్నించి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా విద్యార్దులకు కొన్ని ముఖ్యమైన సూచనలు జారీ అయ్యాయి. అడ్మిట్ కార్డు, పరీక్ష మార్గదర్శకాలు ఓసారి చెక్ చేసుకుంటే మంచిది. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 23, 2024, 08:27 PM IST
Jee Mains 2024 Exams: రేపట్నించే జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ పరీక్షలు, అడ్మిట్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Jee Mains 2024 Exams: దేశవ్యాప్తంగా వివిధ ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికి రెండు దశల్లో పరీక్షలు జరుగుతాయి. అవే జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్ పరీక్షలు. ఇందులో జేఈఈ మెయిన్స్ రెండు సెషన్లలో జరుగుతుంది. మొదటి సెషన్ పరీక్షలు రేపు అంటే జనవరి 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా జేఈఈ మెయిన్స్ పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు కొన్ని కీలకమైన సూచనలు పాటించాల్సి ఉంటుంది. 

JEE Main 2024 Session 1 పరీక్షలు జనవరి 24, 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరగనున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ఐఐటీలు ఎన్ఐటీల్లో అడ్మిషన్ల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను నిర్వహిస్తుంటుంది. జేఈఈ మెయిన్స్ పరీక్షను రెండు సెషన్లలో, జేఈఈ అడ్వాన్స్ పరీక్షను ఒక సెషన్‌లో నిర్వహిస్తుంది. జేఈఈ మెయిన్స్ ఉత్తీర్ణులైతేనే జేఈఈ అడ్వాన్స్ పరీక్ష రాసేందుకు వీలుంటుంది. జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులు ఇప్పటికే ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలయ్యాయి. పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు ఈ లింక్ https://jeemain.ntaonline.in/frontend/web/advancecityintimationslip/admi... క్లిక్ చేసి తగిన వివరాలు నమోదు చేయడం ద్వారా అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

జేఈఈ మెయిన్స్ 2024 విద్యార్ధులకు ముఖ్య సూచనలు

అడ్మిట్ కార్డుతో పాటు ఎన్‌టీఏ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న సెల్ఫ్ డిక్లరేషన్ ఫిల్ చేసి తీసుకెళ్లాలి. పరీక్ష సమయంలో అటెండెన్స్ షీట్‌పై అతికించేందుకు పాస్‌పోర్ట్ సైజ్ పోటో అవసరం. పరీక్ష హాలుకు ఏదో ఒక ఐడీ కార్డు తప్పకుండా తీసుకెళ్లాలి. పరీక్షకు పారదర్శకంగా ఉండే బాల్ పాయింట్ పెన్ ఉపయోగించాలి. దివ్యాంగ విద్యార్ధులైతే సంబంధిత సర్టిఫికేట్ తప్పకుండా తీసుకెళ్లాలి. 

ఇక పరీక్ష ప్రారంభానికి 2 గంటల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. అభ్యర్ధులు తమకు కేటాయించిన స్థానంలోనే కూర్చోవాలి. కంప్యూటర్‌లో అందుబాటులో ఉన్న ప్రశ్నాపత్రం..అడ్మిట్ కార్డులో సూచించిన అంశానికి తగ్గట్టు ఉందో లేదో చూసుకోవాలి. 

Also read: AP Rajyasabha Elections: రాజ్యసభ ఎన్నికల వేళ టీడీపీకు షాక్, గంటా రాజీనామా ఆమోదం, 9 మందికి నోటీసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News