Reliance Industries: దేశంలో ప్రతిరోజు పెట్రోల్, డీజీల్ ల రేట్టు రోజురోజుకు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు పెట్రోల్ ధరలను చూసి బెంబెలెత్తిపోతున్నారు. అత్యవసరమైతే తప్ప కొందరు మాత్రం వాహనాలను ఉపయోగించడం పూర్తిగా తగ్గేసినట్లు తెలుస్తోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజీల్ ధరలపై అనేక రకాల మీమ్స్ లు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. ఇదిలా ఉండగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజ అధినేత ముఖేష్ అంబానీ తీపికబురు అందించారు. ప్రస్తుతం వెనిజులా నుంచి కూడా పెట్రోల్ ముడి చమురును దిగుమతి చేసుకునే విధంగా ఒప్పందంకుదుర్చుంది.
అయితే.. గతంలో వెనిజులా పై 2019 లో ఆర్థిక ఆంక్షలు విధించారు. అయితే.. తాజాగా దీన్ని సడలించినట్లు సమాచారం. దీంతో భారత్ మూడేళ్ల తర్వాత తక్కువ ధరకే పెట్రోల్, డీజీల్ లను దిగుమతి చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇదివరకే రిలయన్స్ దిగ్గజ సంస్థ ౩ ట్యాంకర్ల ముడిచమురును అడ్వాన్స్ గా బుక్ చేసుకుందంట. అంతేకాకుండా.. వెనిజులా నుంచి కూడా డెలివరీ ప్రారంభమైనట్లు సమాచారం. ఇంతకు ముందు కూడా, రిలయన్స్ ఇండస్ట్రీస్ తో పాటు, నయారా ఎనర్జీ లిమిటెడ్ వెనిజులా నుండి క్రమం తప్పకుండా ముడి చమురును దిగుమతి చేసుకునేది. అయితే ఈసారి వెనిజులా నుంచి రిలయన్స్ సంస్థ ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. ఇది జరిగితే రాబోయే మూడేళ్లలో పెట్రోల్ , డీజీల్ ల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు రిలయన్స్ వర్గాలు తెలిపాయి.
రష్యా ముడి చమురుకు ప్రత్యామ్నాయం
ఇప్పటివరకు రష్యా నుంచి భారత్ భారీ రాయితీపై ముడిచమురు దిగుమతి చేసుకునేది. ఇప్పుడు ఈ తగ్గింపు బ్యారెల్‌కు కేవలం $2కి తగ్గింది. వెనిజులా నుంచి భారత్‌కు బ్యారెల్‌కు 8 నుంచి 10 డాలర్ల తగ్గింపుతో ముడి చమురు లభిస్తుందని అంచనా వేస్తున్నారు. వెనిజులా ముడి చమురు ఎగుమతి చేసే దేశాల సంస్థ అయిన OPECలో సభ్యదేశంగా కూడా ఉంది.
ప్రస్తుతం వెనిజులా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలను కలిగి ఉంది. అటువంటి పరిస్థితిలో, వెనిజులా నుండి చవకైన చమురు లభిస్తే, మార్కెట్లో క్రూడ్ ధరలు భారీగా తగ్గుతాయి. దీంతో భారతీయ రిఫైనరీలు లాభపడతాయి. ఇది అంతిమంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడంలో సహాయపడుతుంది.
భారతదేశం తన ముడి చమురు అవసరాలలో 80% దిగుమతి చేసుకుంటుంది. అయితే.. ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. భారీగా పెరిగిపోయిన పెట్రోల్, డీజీల్ ధరలతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఈ చమురు ఒప్పందంతో ధరలను తగ్గించేలా కేంద్ర చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు సమాచారం. అయితే..ఎన్నికల తాయిలాల మాదిరిగా ఉపయోగించుకుని లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నట్లు ప్రతిపక్షాలు విమర్షిస్తున్నాయి.
Read Also: Ayodhya: భవ్యరామమందిరం ప్రారంభోత్సవం.. ముస్లిం ఫ్యామిలీ తమ బాలుడికి ఏంపేరు పెట్టారో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook