పట్టువీడని విక్రమార్కుడు స్వామీ ; టీటీడీ వివాదంపై హైకోర్టులో పిటిషన్

                                                          

Last Updated : Oct 9, 2018, 10:09 AM IST
పట్టువీడని విక్రమార్కుడు స్వామీ ; టీటీడీ వివాదంపై హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్: టీటీడీ వివాదంపై పట్టువీడని విక్రమార్కుడిలా వ్యహరిస్తున్న బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి.. ఈ విషయంలో తాడో పేడో తేల్చుకునేందుకు హైకోర్టు గుమ్మం తొక్కారు. ఈ మేరకు ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఆలయ నిర్వహణ ప్రభుత్వ ఆధీనంలో ఉండటం వల్ల నిధులు దుర్వియోగం అవుతున్నాయనేది స్వామి ప్రధాన ఆరోపణ. టీటీడీ బోర్డుకు ప్రభుత్వ ప్రమేయం లేని స్వయంప్రతిపత్తి కల్పించాలని స్వామి కోరుతున్నారు. దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని స్వామి తన పిటిషన్ లో పేర్కొన్నారు.  

తాజా పిటిషన్ పై సుప్రమణ్య స్వామి స్పందిస్తూ టీటీడీ వివాదంపై తాను వేసిన పిటిషన్ హైకోర్టులో త్వరలోనే విచారణ రానుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన లా విద్యార్థి సత్య సబర్వాల్‌తో కలిసి ఇవాళ ఈ పిటిషన్ దాఖలు చేసినట్టు స్వామీ ట్విటర్లో ద్వారా వెల్లడించారు.

 

సుబ్రమణ్యస్వామి ఇదే అంశంపై సుప్రీం కోర్డు గడప తొక్కడంతో దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం ఈ పిటిషన్ ను తోసిపుచ్చింది. ఇది స్థానిక అంశమైనందున ...కింది స్థాయి కోర్టును ఆశ్రయించాలని బాల్ హైకోర్టులో నెట్టింది. దీంతో సుబ్రమణ్యం స్వామీ హైకోర్టు బాట పట్టారు. హైకోర్టులో తన వాదనలు మరింత బలంగా వినిపించేందుకు రెడీ అవుతున్నారు. దీనిపై న్యాయస్థానం ఏలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠత నెలకొంది.

 

 

Trending News