Acidity Remedy At Home: ఆధునిక జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలా మంది వేయించిన ఆహారాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. దీని కారణంగా పొట్ట నొప్పి, ఎసిడిటీ వంటి సమస్యల బారిన పడుతున్నారు. దీని కారణంగా తీవ్ర పొట్ట సమస్యల బారిన కూడా పడుతున్నారు. దీని నుంచి ఉపశమనం పొదండానికి మార్కెట్‌లో లభించే వివిధ రకాల రసాయనాలతో కూడిన ఔషధాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే వీటికి బదులుగా ముందుగా ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఎసిడిటీ సమస్యలతో బాధపడేవారు ఆరోగ్య నిపుణులు తెలిపిన కొన్ని చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు.
పెరుగు:
పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా పొట్టకు చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే ప్రొటీన్లు, కాల్షియం, రిబోఫ్లావిన్, విటమిన్ బి6 శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. అంతేకాకుండా పొట్టలోని యాసిడ్‌ను కూడా సులభంగా తొలగిస్తుంది. దీంతో పాటు పొట్టలోని మంటను కూడా సులభంగా తొలగిస్తుంది. ఇది ప్రోబయోటిక్‌గా కూడా పని చేస్తుంది. కాబట్టి తరచుగా ఎసిడిటీ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పెరుగుతో తయారు చేసిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది.
ఇంగువ:
పొట్టలోని గ్యాస్ సమస్యతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఇంగువను ఆహారాల్లో వినియోగించడం వల్ల తక్షణ ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా ఇది పొట్టలోని గ్యాస్‌ను తగ్గించి..తీవ్ర ఎసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా పొట్ట సమస్యలతో బాధపడుతున్నవారు గోరువెచ్చని నీటిలో ఇంగువ కలుపుకుని తాగాలి.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
సోంపు:
ఎసిడిటీ సమస్యలు ఉన్నవారు ప్రతి రోజు భోజనం చేసిన తర్వాత చెంచా సోంపును తీసుకోవడం అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. సోపులో యాంటీ అల్సర్ లక్షణాలు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఆహారాలు తిన్న తర్వాత సోంపును లేదా సోంపు నీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును నియంత్రించేందుకు కూడా సహాయపడతాయి. అంతేకాకుండా సోంపు నీటిలో బెల్లం కలిపి తీసుకోవడం వల్ల రెట్టింపు లాభాలు పొందుతారు.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter