Orange Side Effects: చలికాలం రాగానే మార్కెట్లో నారింజపండ్ల స్టాల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. మనకు ఇవి ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. ధర కూడా తక్కువ కావడంతో కొనుగోలు చేయడానికి వెనుకాడం. ఎందుకంటే నారింజ ఆరోగ్యానికి చాలా మంచిది. నారింజ తింటే ముఖ్యంగా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. కానీ, ఈ నారింజ కొందరికి హానికరం. దీన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యం కంటే అనారోగ్య సమస్యలే ఎక్కువ గా వస్తాయట. నారింజ పండును ఏ వ్యక్తులు తినకుండా జాగ్రత్తపడాలో ఈరోజు మనం తెలుసుకుందాం.
1. నారింజపండును ముఖ్యంగా పంటి సమస్యలు ఉన్నవారు తీసుకోకూడదు. దంతాలు బలహీనంగా ఉన్నవ్యక్తులు ఆరెంజ్ తీసుకోవడం వల్ల పంటి ఎనామిల్ తో ఉన్న కాల్షియంతో కలిసి బ్యాక్టిరియాను ప్రోత్సహిస్తుంది. దీంతో పంటి ఆరోగ్యం మరింత దిగజారుతుంది. అందుకే పంటి నొప్పి సమస్యలు ఉన్నవారు నారింజకు దూరంగా ఉండాలి.
2. అంతేకాదు యాసిడిటీతో బాధపడేవారు కూడా ఆరెంజ్ తినకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే నారింజ స్వభావం కలది. కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు నారింజ తింటే ఆరోగ్యం కంటే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఆరెంజ్ తినగానే వీరి కడుపులో యాసిడ్ కంటెంట్ మరింత పెరుగుతుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్ కు కారణమవుతుంది.
ఇదీ చదవండి: చలికాలంలో ప్రతిరోజూ 100 గ్రాముల పచ్చి బఠాణీలు తింటే ఈ 5 లాభాలు..!
3. నారింజపండును జలుబు, దగ్గుతో బాధపడేవారు కూడా తినకూడదు. సాధారణంగా ఈ సమస్యలు ఉన్నవారు చలువచేసే ఆహారాలకు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తారు. ఆరెంజ్ తింటే చలువ పెరిగిపోతుంది. దీంతో జలుబు దగ్గు కూడా మరింత పెరిగిపోతుంది.
4. కిడ్నీల్లో రాళ్ల సమస్యలు ఉన్నవారు కూడా నారింజ పండుకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇందులో ఉండే ఫైబర్ డయేరియాకు దారితీస్తుంది. గుండెమంట సమస్యలను కూడా పెంచుతుంది. అంతేకాదు, ఈ పండు తింటే కిడ్నీల్లో రాళ్లు పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.
ఇదీ చదవండి: ఈరోజు నుంచే ఈ 5 ఆహారాలకు దూరంగా ఉండండి.. మీ లివర్ కు నో రిస్క్ ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Orange Side Effects: ఈ వ్యక్తులు నారింజ తింటే ఆరోగ్యం కాదు.. అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందట..