AP latest Jobs 2024: ఏపీ వైద్యారోగ్య శాఖలో 424 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

AP DME Jobs: ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 424 పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 30, 2024, 10:20 PM IST
AP latest Jobs 2024: ఏపీ వైద్యారోగ్య శాఖలో  424 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

Andhra Pradesh latest Jobs 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో 424 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. ఈ ఖాళీలను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌, లేటరల్‌ ఎంట్రీ ద్వారా భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను మంగళవారం మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా సూపర్‌ స్పెషాలిటీలో 169, బ్రాడ్‌ స్పెషాలిటీలో 255 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు మెంబర్‌ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. 

సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల పరిధిలోని మెడికల్‌ కాలేజీల్లోని 169 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 6వ తేదీన విజయవాడలోని డీఎంఈ కార్యాలయంలో వాక్‌ ఇన్‌ రిక్రూట్‌మెంట్‌ నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు. ఇంట్రెస్ట్ గల అభ్యర్థులు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపు వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. బ్రాడ్‌ స్పెషాలిటీల్లోని 255 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎం.శ్రీనివాసరావు తెలిపారు. పూర్తి వివరాల కోసం https://dme.ap.nic.in/ , http://apmsrb.ap.gov.in/msrb/ వెబ్‌సైట్లను సంప్రదించండి. 

ఆ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు
కాకినాడ రంగరాయ వైద్య కళాశాల్లో ఖాళీగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్, పోస్ట్‌ మార్టం అటెండెంట్‌ ఉద్యోగాలను కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.18,500, పోస్ట్‌మార్టం అటెండెంట్‌కు రూ.15వేలు జీతం ఇవ్వనున్నారు.  రంగరాయ మెడికల్ కాలేజీలో ప్రభుత్వం ఇటీవల అనుమతించిన ఏడు పోస్టుల్ని కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనుంది. ఇందులో ఈసీజీ టెక్నిషియన్, కార్డియాలజీ టెక్నిషియన్, క్యాథ్‌ ల్యాబ్‌ టెక్నిషియన్, పెర్‌ఫ్యూషనిస్ట్‌, అనస్తీషియా టెక్నిషియన్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, బయో మెడికల్ టెక్నిషియన్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి. వీటిలో ఓటీ అసిస్టెంట్‌ ఉద్యోగాన్ని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో మిగిలిన ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు. 

Also Read: APPSC Notification 2024: 1.80 లక్షల జీతంతో ఏపీలో డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టుల భర్తీ, నోటిఫికేషన్ విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News