Hemanth Soren Resign: భూ కుంభకోణం కేసులో విచారణ ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముక్తి మోర్చ అధినేత హేమంత్ సోరేన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. పలుసార్లు విచారణకు రావాలని నోటిసులు ఇస్తున్నా హాజరుకాకపోవడంతో ఎన్ఫోర్స్మెంట్ డిపార్టమెంట్ మంగళవారం అతడిని ఇంట్లో నిర్బంధించింది. కొన్ని గంటల పాటు విచారణ చేపట్టిన ఈడీ ఎట్టకేలకు అరెస్ట్ చేసిందని సమాచారం. ఈ క్రమంలోనే హేమంత్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. జార్ఖండ్ తదుపరి ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ నియమితులవుతారని సమాచారం.
జార్ఖండ్‌లో కొన్ని రోజులుగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈడీ హేమంత్ సోరేన్‌పై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవడంతో ఆ రాష్ట్రంలో పరిణామాలు ఉత్కంఠ కలిగించాయి. ఈ క్రమంలోనే నిన్న జేఎంఎం ఎమ్మెల్యేలతో హేమంత్ సోరెన్ సుదీర్ఘ చర్చలు చేశారు. ఈడీ అరెస్ట్ చేస్తే తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఇక మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌కు ఎమ్మెల్యేలతో సహా వెళ్లిన హేమంత్ సోరెన్ రాజీనామాను సమర్పించారు. ఇక తదుపరి తమ శాసనసభ పక్ష నేతగా చంపై సోరెన్‌ను ఎన్నుకున్నట్లు ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాన్ని కూడా గవర్నర్‌కు ఇచ్చారు.
ఈడీ విచారణ నేపథ్యంలో జార్ఖండ్ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆంక్షలు విధించారు. రాంచీలోని రాజ్ భవన్, సీఎం నివాసం, ఈడీ కార్యాలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా 144 సెక్షన్‌ను విధించారు. తాజా పరిణామాలపై జేఎంఎం ఎంపీ మహువా మాజి స్పందిస్తూ 'సోరెన్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈడీ బృందంతో కలిసి సోరెన్ గవర్నర్‌కు రాజీనామా సమర్పించారు. చంపై సోరెన్ తదుపరి ముఖ్యమంత్రి అవుతున్నారు. మాకు సరిపడా సంఖ్యా బలం ఉంది' అని తెలిపారు.
జార్ఖండ్‌లో ఇండియా కూటమి ప్రభుత్వం ఉంది. అత్యధికంగా 26 గెలుపొందిన జేఎంఎం ఆధ్వర్యంలో కాంగ్రెస్ (16), ఎన్సీపీ (1), సీపీఐ ఎంఎల్ (1), ఆర్జేడీ (1) కలిపి ప్రభుత్వం కొనసాగుతోంది.
జార్ఖండ్ అసెంబ్లీలో బలాబలాలు
మొత్తం స్థానాలు 81 (ప్రభుత్వానికి కావాల్సిన బలం 40)
జేఎంఎం పార్టీ 26
బీజేపీ 25
కాంగ్రెస్ పార్టీ 16
ఏజేఎస్‌యూ 3
ఐఎన్డీ 3
ఎన్సీపీ 1
సీపీఐ (ఎంఎల్) 1
ఆర్జేడీ 1
ఒక స్థానం ఖాళీగా ఉంది.
Also Read: Kumari Aunty: స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీపై పోలీస్ కేసు.. ఆందోళనలో ఆమె అభిమానులు
Also Read: Women Cheat Delhi Hotel: స్టార్ హోటల్లో మోసం చేయబోయి చిక్కిన తెలుగింటి మహిళ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook