ఉత్తరకొరియా విషయంలో చైనా, రష్యాల వైఖరి చెప్పాలి - జపాన్

.

Last Updated : Sep 22, 2017, 03:38 PM IST
ఉత్తరకొరియా విషయంలో  చైనా, రష్యాల వైఖరి చెప్పాలి - జపాన్

టోక్యో: తమ దేశం మీదుగా బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగాలు చేపట్టి ..ఉత్తరకొరియా తమ దేశ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని షింజోఅబే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర కొరియా మిస్సైల్ ప్రయోగాలతో ఉద్రిక్త పరిస్థతులు నెలకొన్న నేపథ్యంలో జపాన్ ప్రధాని మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉత్తరకొరియాతో పాటు ఆ దేశంతో జపాన్ తో పాటు ప్రపంచ దేశాలకు ముప్పుందని..ఆదిలోనే దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తరకొరియా విషయంలో అమెరికా చేపట్టే ప్రతి చర్యకు తమ మద్దతు ఉంటుందన్నారు. అయితే ఈ అంశంపై చైనా, రష్యాలు వైఖరింటో చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.  చైనా, రష్యాలు కూడా ఉత్తరకొరియాపై ఒత్తిడి చేస్తే ఫలితం మరోలా ఉంటుందన్నారు. ఇవేవి ఉత్తరకొరియా బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగాలను నిలువారించలేని పక్షంలో సైనిక చర్యకు దిగాలని అబే అమెరికా అధ్యక్షుడికి సూచిస్తున్నారు.

Trending News