Nampally Exhibition: నాంపల్లి ఎక్జిబిషన్ లో భర్త పాడుపని.. పీఎస్ లో దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన భార్య.. అసలేం జరిగిందంటే..?

Hyderabad: నాంపల్లి ఎక్జిబిషన్ రద్దీగా ఉంది. ఇదే అదనుగా భావించిన ఒక వ్యక్తి మరో మహిళ వెనుకాల వెళ్లి నిలబడ్డాడు. అంతే కాకుండా ఏదో తెలవనట్లు అమాయకంగా వెకిలిచేష్టలు చేశాడు. 

Last Updated : Feb 1, 2024, 12:49 PM IST
  • - నాంపల్లి ఎక్జిబిషన్ లో పాడుపని
    - వీడియో రికార్డు చేసిన షీటీమ్ పోలీసులు
    - పీఎస్ లో అందరి ముందే భర్తకు షాకిచ్చిన భార్య..
Nampally Exhibition: నాంపల్లి ఎక్జిబిషన్ లో భర్త పాడుపని.. పీఎస్ లో దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన భార్య.. అసలేం జరిగిందంటే..?

Man Harassed Woman In Nampally Exhibition Crowd: హైదరాబాద్ లో ప్రతిఏడాది నాంపల్లి లో ఎక్జిబిషన్ ను నిర్వహిస్తుంటారు. దీనిలో వందల కొద్ది స్టాళ్లను ఏర్పాటు చేస్తుంటారు. బట్టలు, వెరైటీ ఫుడ్స్, రకారకాల కాస్టూమ్స్, బెడ్ షిట్, చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అన్ని వయస్సుల వారికి నచ్చే విధంగా అన్ని తినే పదార్థాలు అందుబాటులో ఉంచుతారు. జాయింట్ వీల్స్, హర్స్ రైడింగ్, కారు డ్రైవింగ్ వంటివి కూడా ఉంటాయి.

చాలా మంది నగర వాసులు.. ప్రతి ఏడాది నాంపల్లికి వెళ్లి ఈ బిజి లైఫ్ నుంచి కాస్తంతా రిలాక్స్ అవుతుంటారు. అయితే.. ఇక్కడ జనాలు కిక్కిరిసిపోతుంటారు. ఒకరిని తాకుతూ మరోకరు వెళ్తుంటారు. కొందరు కామాందులు ఇదే అదునుగా భావిస్తుంటారు. మహిళలు, యువతులను అసభ్యంగా తాకుతూ నీచంగా ప్రవర్తిస్తుంటారు. కానీ వీరిని చెక్ పెట్టేలా పోలీసులు, షీ టీమ్ సిబ్బంది కూడా మఫ్టీలో ఉంటారు. ఇలాంటి ఘటనలు చేస్తు దొరికిన వారికి తమదైన స్టైల్ లో ట్రీట్మెంట్ ఇస్తారు. అచ్చం ఇలాంటి ఘటన ప్రస్తుతం నుమాయిష్ లో వెలుగు చూసింది.

పూర్తి వివరాలు..

నాంపల్లి ఎక్జిబిషన్ లో బుధవారం ఒక వ్యక్తి మరో మహిళను ఫాలో అవుతున్నాడు. అక్కడ కాస్తంతా రద్దీగా ఉంది. మహిళ  పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఏమి తెలియనట్లు ముందుకు వెళ్తున్నాడు. ఇదంతా అక్కడ మఫ్టీలో ఉన్న షీ టీమ్ సిబ్బంది తమ ఫోన్ లో రికార్డు చేశారు. ఆ తర్వాత కేటుగాడిని అదుపులోకి తీసుకుని బేగంబజార్ ఠాణాకు తరలించారు.

ఆ తర్వాత అతగాడి, భార్యను పిలిపించి, అతగాడి నిర్వాకాన్ని చూపించారు. దీంతో ఆమె స్టేషన్ లోనే భర్త చెంప ఛెళ్లు  మన్పించింది. ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది. రద్దీగా ఉందని, ఎవరు చూడట్లేదు కదా.. అని వెకిలిచేష్టలు చేస్తే మాములుగా ఉండదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News