Shani Dev: శనివారం ఈ 5 వస్తువులను ఇంట్లోకి అస్సలు తెచ్చుకోవద్దు.. జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..?

Astrology News in Telugu: శనివారానికి అధిపతి శనీశ్వరుడు. ఆయన సూర్యభగవానుడి కుమారుడు. అదే విధంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం రోజు కొన్ని నియమాలు పాటించాలి. కొన్ని వస్తువులను ఈ రోజు అస్సలు ఇంట్లోకి తెవద్దంటారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2024, 03:32 PM IST
  • - శనివారం రోజు ఉప్పు, నూనె కొనొద్దంట..
    పాటించాల్సిన సూచనలు తెలిపిన జ్యోతిష్యులు
Shani Dev: శనివారం ఈ 5 వస్తువులను ఇంట్లోకి అస్సలు తెచ్చుకోవద్దు.. జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..?

Avoid Purchase These Things ON Saturday: మనలో చాలా మంది ఆయా గ్రహదోషాలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా శనిదేవుడి వల్ల ఎక్కువ మంది ప్రభావితమౌతుంటారు. అయితే.. తొమ్మిది గ్రహలు ఆయా రాశులలో కొంత కాలం ఉండి మరల వేరోక రాశిలోకి వెళ్లిపోతాయి. కానీ శనిదేవుడు మాత్రం మెల్లగా ప్రయాణిస్తాడు. అందుకే ఆయనను మందగముడని అంటారు. ఈయన ఏలినాటి, అర్దష్టమ ఫలితాలను ఇస్తుంటాడు. వ్యక్తి చేసుకున్న కర్మలను బట్టి ఆయన ఫలితాలు ఇస్తుంటాడు. 

అయితే.. శనిదేవుడికి ఇష్టమైన శనివారం రోజు ఈ వస్తువులు మాత్రం అస్సలు కొనుగోలు చేయోద్దని జ్యోతిష్యులు చెబుతుంటారు. ఇవి ఇంట్లోకి తెచ్చుకుంటే ఆయనను పరోక్షంగా వెల్ కమ్ చెప్పినట్లే అని చెబుతుంటారు. ముఖ్యంగా శనివారం రోజున ఉప్పు, నూనెలను అస్సలు కొనుగోలు చేయోద్దు.

Read Also: Snakes: ఈ చెట్లంటే పాములు పడిచస్తాయంట.. ఇవి ఇంట్లో ఉంటే పాములకు గ్రీన్ కార్పెట్ వేసినట్లే..

అదే విధంగా నల్లనువ్వులు, ఇనుము సంబంధించిన వస్తువులు, కొత్త చెప్పులను కొనుగోలు చేయోద్దని జ్యోతిష్యులు చెబుతుంటారు.  శనివారం రోజున .. శనిదేవుడికి మాత్రం నల్లనువ్వులు, నూనెతో అభిషేకం చేస్తారు. ఇదంతా ఒకరోజు ముందుగానే ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలి. మరుసటి రోజున పూజలో ఉపయోగిస్తే ఎలాంటి చెడు ప్రభావాలు ఉండవని జ్యోతిష్యులు చెబుతున్నారు.

(Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News