Fat Reducing Drink: ఈ మధ్యకాలంలో అధిక బరువు సమస్యలతో బాధపడేవారి సంఖ్య అధికంగా ఉంది. ఈ సమస్య బారిన పడిన వారు ఎన్నో అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే దీని కోసం ఎలాంటి ఖర్చు, మందులు లేకుండా సులువుగా బయటపడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని కోసం మన వంటింట్లోనే ఒక ఔషధం ఉందని చెబుతున్నారు.
దీనిని ప్రతిరోజు మూడు సార్లు తీసుకోవడం వల్ల నడుము, పొట్ట, తొడల దగ్గర ఉండే కొవ్వు సులభంగా కరుగుతుంది. అంతేకాకుండా కొద్ది రోజులోనే మీరు బరువు కూడా తగ్గుతారు. ఈ చిట్కాలతో పాటు మీ ఆహారంలో కొన్ని మార్పులను కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ముందు ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి అంటే ఒక గిన్నెలో గ్లాస్‌తో వాటర్ తీసుకోవాలి . ఇందులో రెండు బిర్యానీ ఆకులు తీసుకోవాలి. తరువాత రెండు యాలకులు, దాల్చిన చెక్క, టీ స్పూన్ జీలకర్రను తీసుకోవాలి.
వీటిని నీటిలో బాగా మరిగించాలి. తరువాత వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దాని ప్రతిరోజు మూడు పూటలా తీసుకోవాలి.
అంతేకాకుండా దీనిని తీసుకోనే వారు ప్రతిసారిఈ గోరు వెచ్చని తీరు తాగాలి. దీనిని ఉదయం పరగడుపున, మధ్యాహ్నం భోజనం చేసిన అరగంట తరువాత, రాత్రిపూట భోసం చేసిన అరగంట తరువాత తీసుకోవాలి.
ఈ జ్యూస్‌ని తప్పకుండా నెలరోజుల పాటు తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే పొట్ట, తొడలలో ఉండే కొవ్వును సులువు తగ్గించవచ్చు. బరువు తగ్గడంలో ఈ డ్రింక్ ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని కేవలం బరువు సమస్యతో బాధపడేవారు కాకుండా షుగర్ లెవెల్స్ ని అదుపు చేయడంలో కూడా ఉపయోగపడుతుంది.
జీర్ణసంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు కూడా ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల వెంటనే సమస్యలు తగ్గు ముఖం పడతాయి. అంతేకాకుండా రాత్రిపూట ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు.
Also read: Nails Tips: గోళ్లు పెంచుతున్నారా ? అయితే ఈ షాకింగ్ న్యూస్ మీకు తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook