Foods To Increase Height: పిల్లల ఎత్తు పెరగాలంటే ఈ ఫుడ్స్ తప్పనిసరిగా తీసుకోవాలి!

Height Increase Foods For Kids: మనం తీసుకొనే ఆహారం శరీరాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది.  ఈ మధ్యకాలంలో చాలా మంది పిల్లలు పొట్టిగా ఉంటున్నారు. ఎత్తు పెరగడం కోసం మార్కెట్‌లో లభించే ప్రొడెక్ట్స్‌, వ్యాయామం అని ఏమీ చేసిన ఎత్తు పెరగకుండా ఉంటున్నారు. కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 6, 2024, 09:33 AM IST
Foods To Increase Height: పిల్లల ఎత్తు పెరగాలంటే ఈ  ఫుడ్స్ తప్పనిసరిగా తీసుకోవాలి!

Height Increase Foods For Kids: వయసుకు తగ్గట్టుగా ఎత్తులేకుంటే చాలా ఇబ్బందుల బారిన పడాల్సి ఉంటుంది.ముఖ్యంగా పిల్లలు ఎత్తు పెరగడం విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.  పిల్లలు ఎత్తుగా ఎదగాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. దీని కోసం మీరు ప్రతిరోజు పోషకాలు కలిగిన కొన్ని పదార్థాలను పిల్లల ఆహారం చేరచడం వల్ల హైట్ పెరుగుతారు.

పిల్లల ఎత్తు పెరిగే ఆహారాలు ఇవే:

పిల్లలకు ప్రతిరోజూ పాలు తాగడం వల్ల ఎత్తు పెరుగుతారు. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

పాలుతో పాటు గుడ్డును తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎత్తు పెరగడంలో గుడ్డు ఎంతో మేలు చేస్తాయి. 

ప్రతిరోజు ఒక క్యారెట్‌ ను పిల్లలు తినడం వల్ల అందులోని విటమన్లు శరీరానికి లభిస్తాయి. దీని వల్ల ఎముకల ఎత్తు పెరుగుదలకు ఉపయోగపడుతుంది.

సోయాబీన్‌లో ఎక్కువ శాతం ప్రోటీన్‌ కంటెంట్‌ ఉంటుంది. ఇది ఎత్తు పెంచడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

బీన్స్‌ తినడం వల్ల ఎముకలను దృఢంగా తయారు చేయడంలో సహాయపడుతుంది. బీన్స్‌లో ప్రోటీన్,ఫైబర్‌, ఐరన్‌, కాల్షియం ఉంటుంది. దీని వల్ల పిల్లలు ఎత్తు పెరుగుతారు.

పిల్లలకు చికెన్‌, మటన్‌ తినిపించడం వల్ల ఎత్తు పెరుగుతారు. ఇందులో ఉండే ప్రోటీన్‌ కండరాల పెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. 

వీటితో పాటు ఆకుకూరలు, కూరగాయలు వారి ఆహారంలో భాగం చేయడం వల్ల ఎత్తు పెరగడంలో సహాయపడుతాయి. 

విటమిన్‌ డి ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఎత్తు పెరుగుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

ఎత్తు పెంచడంలో పాలతో పాటు జున్ను, పనీర్‌, పెరుగు ఇతర పదార్థాలు తీసుకోవడం వల్ల ఎత్తు పెరగడంలో సహాయపడుతాయి.

పిల్లలు ఎత్తు పెరగడంలో పిండి పదార్థాలు, ధాన్యాలు తీసుకోవడం చాలా మంచిది. ఇందులో విటమిన్‌ బి, ఫైబర్‌, ఐరన్‌, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. 

బచ్చలికూర తీసుకోవడం వల్ల ఇందులోని విటమిన్‌ ఎ, సి, కె, ఫైబర్ ఎత్తు పెరగడంలో సహాయపడుతుంది. దీంతో పిల్లలు ఆరోగ్యంగా ఎత్తు పెరుగుతారు.

పిల్లల ఎత్తు పెరగడానికి అరటిపండు ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే పొటాషియం, మాంగనీస్, ఫైబర్‌ ఇతర పోషకాలు పిల్లల ఎత్తు పెంచడంలో సహాయపడుతాయి.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉన్న ఆహార పదార్ధాలు పిల్లల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చేపలు తినడం వల్ల ఎత్తు పెరగడంలో ఎంతో సహాయపడుతాయని నిపుణులు చెబుతున్నారు.

Also Read Weight Loss: వాల్‌నట్స్‌తో కూడా బరువు, BPని తగ్గించుకోవచ్చు..ఇలా చేయండి రోజు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News