Oppo Reno 11F 5g Launched: 64 మెగాపిక్సెల్ కెమేరా 256 జీబీ స్టోరేజ్ ఒప్పో స్మార్ట్‌ఫోన్ కేవలం 11 వేలకే

Oppo Reno 11F 5g Launched: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో మరో కొత్త ఫోన్ లాంచ్ చేసింది.  OPPO Reno 11F 5G స్మార్ట్‌ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్, అద్బుతమైన ఫీచర్లలో ఆకట్టుకుంటోంది. ఈ స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 12, 2024, 05:36 PM IST
Oppo Reno 11F 5g Launched: 64 మెగాపిక్సెల్ కెమేరా 256 జీబీ స్టోరేజ్ ఒప్పో స్మార్ట్‌ఫోన్ కేవలం 11 వేలకే

Oppo Reno 11F 5g Launched: అంతర్జాతీయ మార్కెట్‌లో ఒప్పో రెనో 11 సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. Oppo Reno 11F 5G ధాయ్‌లాండ్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉండగా త్వరలో ఇండియాలో లాంచ్ కానుంది. 32 మెగాపిక్సెల్ కెమేరా 256 జీబీ స్టోరేజ్‌తో అద్భుతమైన డిజైన్ కలిగి ఉంది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర ఇతర వివరాలు తెలుసుకుందాం..

ఒప్పో రెనో 11ఎఫ్ స్మార్ట్‌ఫోన్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా, 64 మెగాపిక్సెల్ రేర్ కెమేరా, ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో 6.7 ఇంచెస్ ఎమోల్డ్ ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 120 రిఫ్రెష్ రేట్ ఉంటుంది. డిస్‌ప్లే టచ్ స్క్రీన్ రేట్ 240 హెర్ట్జ్ ఉంటుంది. ఇందులో సెక్యూరిటీ కోసం పాండా గ్లాస్ వినియోగించటారు. స్క్రీన్ టు బాడీ రేషియో 93.4 ఉంటుంది. Oppo Reno 11F 5G ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రోసెసర్ ఉంటుంది. గ్రాఫిక్స్ పరంగా చూస్తే ARM Mali G68 MC4 GPU ఉంటుంది. ఇందులో 8 జీబీ ర్యామ్, మరో 8 జీబీ వర్చువల్ ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ కోసం 256 జీబీ ఉండటం ప్రత్యేకత. 

ఈ ఫోన్ ధర 8 జీబీ ర్యామ్-256 స్టోరేజ్ అయితే 10,990 రూపాయలుంది. ఇందులో పామ్ గ్రీన్, ఓషియన్ బ్లూ, కోరల్ పర్పుల్ రంగులు ఉన్నాయి. ఒప్పో రెనో 11ఎఫ్ 5జి స్మార్ట్‌ఫోన్ ఎపెర్చర్ ఎఫ్ 1.7 ఆధారంగా 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, ఎపెర్చర్ ఎఫ్ 2.2 ఆధారంగా 8 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 355 అల్ట్రా వైడ్ లెన్స్‌తో పనిచేస్తుంది. సెల్ఫీ కోసం 32 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. 

ఒప్పో రెనో 11 ఎఫ్ 5జి బ్యాటరీ 5000 ఎంఏహెచ్ ఉంటుంది. ఇది 67 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సెక్యూరిటీ కోసం ఇందులో ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ స్పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కనెక్టివిటీ కోసం వైఫై 6, బ్లూటూత్ 5.2, బ్లూటూత్‌లో ఎనర్జీ, టైప్ సి పోర్ట్ ఉన్నాయి. ఇవి కాకుండా జియో మాగ్నెటిక్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఎక్సీలెరేషన్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్ ఉంటాయి.

Also read: Flipkart iPhone 14 Offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై భారీగా తగ్గింపు, కేవలం 30 వేలకే

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News