Cash Without ATM: ఇక ఏటీఎం లేకుండానే ఓటీపీతో డబ్బులు తీసుకోవచ్చు, ఎలాగో తెలుసా

Cash Without ATM: యూపీఐ చెల్లింపులు ఎంతగా పెరిగినా నగదు అవసరం ఉండనే ఉంటుంది. ఏటీఎం అందుబాటులో లేకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అందుకే ఇప్పుడు కొత్తగా వర్చువల్ ఏటీఎంలు అందుబాటులో వస్తున్నాయి. అదెలాగో తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 14, 2024, 07:42 AM IST
Cash Without ATM: ఇక ఏటీఎం లేకుండానే ఓటీపీతో డబ్బులు తీసుకోవచ్చు, ఎలాగో తెలుసా

Cash Without ATM: ఇటీవల గత కొద్దికాలంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ వినియోగం అధికమైంది. అయినా ఒక్కోసారి నగదు అవసరమైనప్పుడు దగ్గరలో ఏటీఎంలు లేకున్నా, అవి పనిచేయకపోయినా ఇబ్బంది ఎదురౌతుంటుంది. అందుకే ఇప్పుడు ఏటీఎంలు లేకున్నా మీకు దగ్గరలో ఉండే దుకాణాల్నించి నగదు తీసుకునే అవకాశం కలగనుంది. కేవలం ఓటీపీ ఉంటే చాలు..

ఏటీఎంలు లేకుండా షాపుల్లోంచి నగదు ఎలా తీసుకుంటామని ఆలోచిస్తున్నారా..చండీగఢ్ కేంద్రంగా పనిచేస్తున్నపేమార్ట్ అనే ఫిన్‌టెక్ సంస్థ ఏటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డు లేకుండానే నగదు పొందగలిగే సేవలు అందిస్తోంది. వర్చువల్ ఏటీఎం సేవలు అందిస్తోంది. ఏటీఎంకు వెళ్లాల్సిన పనిలేకుండా కేవలం ఓటీపీతో దగ్గరలోని షాపు నుంచి నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం కలుగుతుంది. 

ఎలా పనిచేస్తుందంటే

ఇదొక వర్చువల్ ఏటీఎం, ఇంటర్నెట్ ఉన్న స్మార్ట్‌ఫోన్ అవసరమౌతుంది. దీనికోసం ముందుగా పేమార్ట్ బ్యాంకింగ్ యాప్ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ముందుగా ఈ యాప్ ద్వారా బ్యాంకుకు విత్‌డ్రా రిక్వెస్ట్ పంపించాలి. యూజర్ మొబైల్ నెంబర్, బ్యాంకు ఎక్కౌంట్‌తో లింక్ అయుండాలి. ఈ రిక్వెస్ట్ ఆధారంగా ఆ యూజర్‌కు బ్యాంక్ ఒక ఓటీపీ పంపిస్తుంది. ఈ కోడ్‌ను మీకు సమీపంలోని షాపుల్లో చూపించి అక్కడ నగదు తీసుకోవచ్చు. ఈ సేవలు అందించే షాపుల జాబితా, లొకేషన్, ఫోన్ నెంబర్ వివరాలు పేమార్ట్ యాప్‌లో ఉంటాయి.

ఇప్పటివరకూ పేమార్ట్ కంపెనీ ఐడీబీఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, జమ్ము కశ్మీర్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలోని ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతానికి చండీగఢ్, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబై నగరాల్లో ఈ సేవలు పొందవచ్చు. ఈ ఏడాది మార్చ్ నాటికి మరి కొన్ని బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుని సేవలు విస్తరించే ఆలోచన చేస్తోంది పేమార్ట్ కంపెనీ. త్వరలో దేశవ్యాప్తంగా 5 లక్షల ప్రాంతాల్లో సేవలు అందించనున్నట్టు తెలిపింది. 

ఈ సేవలకు పేమార్ట్ సంస్థ ఎలాంటి సర్వీస్ ఛార్జి వసూలు చేయడం లేదు. అయితే షాపుల్లోంచి ఎంతమేర నగదు పొందేందుకు లిమిట్ ఉంటుందనే వివరాలు ఇంకా తెలియలేదు. చిన్న మొత్తం నగదు తీసుకునేందుకే అవకాశం ఉండవచ్చు. పెద్దమొత్తంలో డబ్బులు షాపుల వద్ద ఉండకపోవచ్చు. వర్చువల్ ఏటీఎం సేవలపై బ్యాంకులు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. కారణం ఈ సేవల ద్వారా మారుమూల ప్రాంతాల్లో సైతం బ్యాంకింగ్ సేవలు అందించవచ్చు. ఏటీఎంల నిర్వహణ భారం తగ్గించుకోవచ్చు. షాపు యజమానికి కమీషన్ ద్వారా ఆదాయం అందుతుంది. 

Also read: Maglev Train: ప్రపంచంలోనే హైస్పీడ్ రైలు, గంటకు 623 కిలోమీటర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News