Vangaveeti Radha: ఏపీలో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం-జనసేనలు కలిసి ఉమ్మడి జాబితా ప్రకటించాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం ఒకేసారి 94 మంది అభ్యర్ధుల్ని ప్రకటించింది. కానీ తెలుగుదేశం సీనియర్లకు స్థానం లేకపోవడంతో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా వంగవీటి రాధా పయనం ఎటు అనేది చర్చనీయాంశంగా మారింది.
2019 ఎన్నికల సమయంలో మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయమని కోరడంతో నిరాకరించిన వంగవీటి రాధాకృష్ణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. ఆ సమయంలో అతనికి ఎమ్మెల్సీ హామీ ఇచ్చినా అమలు కాలేదు. అయినా అలాగే టీడీపీలో కొనసాగుతూ వస్తున్నారు. ఇటీవల జనసేన, వైసీపీ నుంచి ఆహ్వానం వచ్చినా ఆయన స్పందించలేదు. ఆ తరువాత లోకేశ్ పాదయాత్రలో కూడా పాల్గొని టీడీపీ వెంటే ఉన్నానన్పించారు.
నిన్న ప్రకటించిన 94 మంది జాబితాలో విజయవాడ తూర్పు నుంచి గద్దే రామ్మోహన్, విజయవాడ సెంట్రల్ నుంచి బొండా ఉమ పేర్లు ఖరారయ్యాయి. ఇక విజయవాడ పశ్చిమం కోసం తెలుగుదేశం వర్సెస్ జనసేన పోటీ పడుతున్నాయి. ఈ స్థానం ఎవరికి కేటాయించినా బీసీ లేదా మైనార్టీ వర్గానికే ఉంటుంది. అంటే విజయవాడ పశ్చిమం నుంచి వంగవీటి రాధాకు అవకాశం లేనట్టే. వాస్తవానికి వంగవీటి రాధా సెంట్రల్ సీటు ఆశించారు. ఇప్పుడు తొలి జాబితాలో వంగవీటి పేరు లేకపోవడం, మరో అవకాశం లేకుండటంతో ఆయన అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమౌతోంది. సోషల్ మీడియాలో బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.
ఇక అతనికి మిగిలింది మచిలీపట్నం పార్లమెంట్ స్థానమే. ఈ స్థానంలో వైసీపీ నుంచి జనసేన తీర్ధం పుచ్చుకున్న బాలశౌరి మరోసారి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దాంతో టీడీపీ-జనసేన పొత్తులో మచిలీపట్నం స్థానం కూడా వంగవీటి రాధాకు దక్కే పరిస్థితి లేదు. ఇక ఆయనకు మిగిలింది వైసీపీ తీర్ధం పుచ్చుకుని ఆ పార్టీ ఆఫర్ చేస్తున్న మచిలీపట్నం పార్లమెంట్ నుంచి పోటీ చేయడం లేదా తెలుగుదేశంలోనే ఉండి పోటీ చేయకుండా మిగలడం.
మొత్తానికి జరిగిన పరిణామాల్లో వంగవీటి రాథ వంటి నేతలకు సైతం సీటు దక్కలేదు. దాంతో వంగవీటి రాధ అభిమానులు తెలుగుదేశంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం 94 స్థానాల్లో అభ్యర్ధులు ప్రకటించడం, జనసేనకు 24 కేటాయించడంతో ఇంకా 57 స్థానాలు మిగిలున్నాయి. వీటిలో బీజేపీ చేరితే ఆ పార్టీకు 10-15 సీట్లు కేటాయించగా మిగిలినవాటిలో టీడీపీ పోటీ చేయనుంది.
Also read: Chegondi Harirama jogaiah: దేహీ అని అడుక్కోవడం పొత్తు ధర్మమేనా, హరిరామ జోగయ్య తీవ్ర వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook