AP MLAs Disqualify: ఆంధ్రప్రదేశ్‌లో మరో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రతిపక్ష టీడీపీపై తిరుగుబాటు చేసిన 8 మంది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారిపై అనర్హత వేటు వేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వీరి అనర్హత వేటుపై విచారణ ప్రక్రియ పూర్తవడంతో వారిపై వేటు వేస్తూ తుది నిర్ణయం వెలువరించారు.
Also Read: Kuppam: చంద్రబాబును ఓడించండి.. కుప్పం అభివృద్ధి చేసుకుందాం: సీఎం జగన్ పిలుపు
అనర్హత వేటు వేయడంతో తక్షణమే ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మద్దాల గిరి, కరణం బలరామ్, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్ మాజీ ఎమ్మెల్యేలు అయ్యారు. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వారు నలుగురు ఉండగా.. మిగిలిన వారు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీలు మారిన టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. పలుమార్లు ఆయా ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వకుండా గైర్హాజరయ్యారు. ఈ క్రమంలోనే వారిపై స్పీకర్ వేటు వేశారు.
Also Read: Floating Bridge: లేదు లేదు 'తేలియాడే వంతెన' కొట్టుకుపోలే.. మేమే దాన్ని విడదీశాం
అనర్హత వేటు పడిన వాళ్లు వీరే..
- ఆనం రామనారాయణ రెడ్డి
- మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
- ఉండవల్లి శ్రీదేవి
- మద్దాల గిరి
- కరణం బలరామ్
- వల్లభనేని వంశీ
- వాసుపల్లి గణేశ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి