Summer Simple Weight Loss Tips In Telugu: వేసవిలో బరువు తగ్గడం చాలా అంత సులభం కాదు. ఎందుకంటే వేసవిలో డీహైడ్రేటెషన్‌ కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా కొంతమందిలో బద్దకం కూడా పెరుగుతుంది. దీని కారణంగా బరువు తగ్గడానికి బదులుగా వెయిట్ పెరుగుతారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఈ సమయంలో తప్పకుండా నిపుణులు సూచించిన పలు చిట్కాలను వినియోగించి బరువు తగ్గాల్సి ఉంటుంది. ముఖ్యంగా బరువు తగ్గడానికి ఈ సమయంలో చాలా మంది వివిధ రకాల డైట్‌లను కూడా అనుసరిస్తున్నారు. ఇక నుంచి వాటిని మానుకోని నిపుణులు సూచించిన ఈ చిట్కాలను వినియోగించండి.  

హైడ్రేటెడ్‌గా ఉండండి: 
ఎండాకాలంలో నీరు పుష్కలంగా తాగడం చాలా ముఖ్యం. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పండ్లు, కూరగాయలు కూడా ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకుంటేనే సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కూరగాయలు, పండ్లను తప్పకుండా డైట్‌ పద్దతిలో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. 

కూల్ డ్రింక్స్ తగ్గించండి:
ఎండా కాలంలో చాలా మంది సోడాలు, జ్యూసులు, ఇతర చక్కెర పానీయాలను ఎక్కువగా తాగుతారు. అయితే బరువు తగ్గాలనుకునేవారు వీటిని తీసుకోవడం తగ్గించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఎక్కువ కేలరీలు లభిస్తాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరిగే ఛాన్స్‌ ఉంది. 

పండ్లు, కూరగాయలు తప్పనిసరి:
వేసవి కాలంలో బరువు తగ్గడానికి ప్రతి రోజు ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే ఆహారాలు డైట్‌ పద్ధతిలో తీసుకోవడం చాలా మేలు. ఇవి మిమ్మల్ని సుదీర్ఘకాలం పాటు సంతృప్తిగా ఉంచుతాయి. అంతేకాకుండా శరీర బరువును నియంత్రించేందుకు కూడా సహాయపడతాయి. 

చిన్న ప్లేట్లలో తినండి:
వేసవిలో ఆహారాలు పెద్ద ప్లేట్లలో తినడం వల్ల ఎక్కువ తినే అవకాశం ఉంది. దీని కారణంగా విపరీతంగా బరువు పెరిగే ఛాన్స్‌ ఉందని వైద్యులు అభిప్రాయ పడుతున్నారు. కాబట్టి ఈ సమయంలో బరువు తగ్గాలనుకునేవారు చిన్న ప్లేట్లలో తినడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..

ఉదయపు వ్యాయామం తప్పనిసరి :
ఉదయం పూట వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గడం సులభతరమవుతుంది. ముఖ్యంగా వేసవిలో బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఉదయం పూట వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇలా చేయడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. దీంతో పాటు రోజంతా కేలరీలను ఎక్కువగా బర్న్ చేయడానికి సహాయపడుతుంది.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి :
వారానికి కనీసం 3-4 సార్లు వ్యాయామం చేయడం లక్ష్యంగా పెట్టుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా వాకింగ్‌, రన్నింగ్‌, స్విమ్మింగ్‌, సైక్లింగ్ వంటి కార్డియో వ్యాయామాలతో సులభంగా బరువు తగ్గొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. 

 (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

English Title: 
Summer Simple Weight Loss Tips: Here Are 5 Tips Suggested By Health Experts To Lose Weight Easily In Summer Dh
News Source: 
Home Title: 

Summer Simple Weight Loss Tips: వేసవిలో సులభంగా బరువు తగ్గడానికి నిపుణులు సూచించిన 5 చిట్కాలు ఇవే!
 

Summer Simple Weight Loss Tips: వేసవిలో సులభంగా బరువు తగ్గడానికి నిపుణులు సూచించిన 5 చిట్కాలు ఇవే!
Caption: 
source file: zee telugu news
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
వేసవిలో సులభంగా బరువు తగ్గడానికి నిపుణులు సూచించిన 5 చిట్కాలు ఇవే!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Tuesday, February 27, 2024 - 12:34
Created By: 
Cons. Dhurishetty Dharmaraju
Updated By: 
Cons. Dhurishetty Dharmaraju
Published By: 
Cons. Dhurishetty Dharmaraju
Request Count: 
15
Is Breaking News: 
No
Word Count: 
352

Trending News