Gangadhar Shastry:
భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు అలా అని ఎంతో ప్రసిద్ధి గాంచిన గాయకులు, భగవద్గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త ఎల్ వి గంగాధర శాస్త్రి కి భారత దేశపు ప్రతిష్ఠాత్మక 'కేంద్ర సంగీత నాటక అకాడమీ' అవార్డు లభించింది. ఈ విషయం తెలియగానే సంగీత అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
2023 సంవత్సరానికి గాను.. ఈ అవార్డులు ప్రకటించగా.. ఆ సంవత్సరానికి గాను ఇతర ప్రధాన సంప్రదాయ సంగీత విభాగం లో ఆయనకు ఈ 'అకాడమీ పురస్కారం' దక్కింది. గంగాధర శాస్త్రి గారు అభ్యసించిన కర్ణాటక శాస్త్రీయ సంగీతం తో - భారత దేశపు ఆధ్యాత్మిక సారమైన భగవద్గీత లోని 700 శ్లోకాలలో.. ఘంటసాల స్వరపరచి పాడిన 108 శ్లోకాలను ఆయన గౌరవార్థం యథాతథం గా పాడడం తో పాటు, అందులో మిగిలిన మిగతా 594 శ్లోకాలను స్వీయ సంగీతం లో, తెలుగు తాత్పర్య సహితం గా గానం చేసి, అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేశాడు.
ఆ రికార్డు చేసిన దాని 'భారతీయ గాయకుడి తొలి సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత' అనే పేరుతో ఏ పి జె అబ్దుల్ కలాం చేతులమీదుగా విడుదల చేసి ఎంతో పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా అంతటి తో తన బాధ్యత తీరిపోయిందని భావించకుండా, స్వార్ధ రహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం గీతా ప్రచారానికే తన మొత్తం జీవితాన్ని అంకితం చేసినందుకు గంగాధర శాస్త్రి కి ఈ అవార్డు దక్కింది.
ఇంతటి మహత్కార్యం చేసినందుకు గతం లో శ్రీ గంగాధర శాస్త్రి ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'కళారత్న'(హంస) పురస్కారం తోను, మధ్యప్రదేశ్ లోని 'మహర్షి పాణిని యూనివర్సిటీ' 'గౌరవ డాక్టరేట్' తో కూడా సత్కరించింది.
ఇక ఇప్పుడు మరోసారి ఈ అవార్డు ప్రకటించిన నేపధ్యం లో - 'గీత' పట్ల తన అంకిత భావాన్ని గత 16 సంవత్సరాలుగా గుర్తిస్తూ వచ్చిన కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖామంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని గంగాధర్ గారు తెలియజేశారు.
అలాగే సంగీత నాటక అకాడమీ' అకాడమీ చైర్మన్ డాII సంధ్య పురేచ కు, జ్యూరీ సభ్యులకు, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ కు గంగాధర శాస్త్రి కృతజ్ఞతలు తెలియజేసారు. ఇది తనకు తొలి జాతీయ అవార్డు.. ఈ అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది అని అన్నారు. ఈ అవార్డు - పాట నేర్పిన తన తల్లి తండ్రులకు, ‘గీతా గాన మార్గదర్శి’ ఘంటసాల కు, గీతా సద్గురువులకు, శాస్త్రీయ సంగీతం నేర్పిన గురువులకు అంకితమని తెలియజేశారు.
Also Read: ఒక్క ఎంపీ సీటైనా గెలవండి.. కేటీఆర్‌కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్
Also Read: రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి గైడ్ లైన్స్.. అర్హులు మాత్రం వీళ్లే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter