Siddham Sabha: సోషల్ మీడియాను ఊపేసిన సిద్ధం సభ, ఎక్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ రికార్డ్

Siddham Sabha: ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహించిన సిద్ధం సభ సోషల్ మీడియాను విపరీతంగా ఊపేసింది.ఎక్స్ లైవ్ స్ట్రీమింగ్‌లో కొత్త రికార్డు సృష్టించింది. సిద్ధం హ్యాష్‌ట్యాగ్‌లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 11, 2024, 02:07 PM IST
Siddham Sabha: సోషల్ మీడియాను ఊపేసిన సిద్ధం సభ, ఎక్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ రికార్డ్

Siddham Sabha: ఏపీలోని అద్దంకి జిల్లా మేదరమెట్లలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సిద్ధం సభ సూపర్ డూపర్ సక్సెస్ టాక్ తెచ్చుకుంది. దాదాపుగా 15 లక్షలమంది హాజరైనట్టుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. సిద్ధం సభ అటు ఎక్స్‌ను కూడా ఊపేసింది. రికార్డు స్థాయిలో లైవ్ స్ట్రీమింగ్ జరిగింది. 

ఏపీలో ఎన్నికల శంఖారావం పూరించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకూ నాలుగు సిద్ధం సభలు ఏర్పాటు చేసింది. మొదటి సభ భీమిలిలో, రెండవది దెందులూరులో, మూడవది రాప్తాడులో నిర్వహించగా నాలుగో సభ బాపట్ల జిల్లా మేదరమెట్లలో అత్యంత ఘనంగా జరిగింది. వైసీపీ వర్గాల అంచనా ప్రకారం 15 లక్షలమంది హాజరైనట్టు తెలుస్తోంది. సభ మధ్యలో ఏర్పాటు చేసిన ర్యాంప్ వై నాట్ 175 ను సూచించే వై ఆకారంలో ఉండటం మరో ప్రత్యేకత. ప్రతి ఒక్కరూ ప్రసంగాన్ని వీక్షించేలా భారీ ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటయ్యాయి. 

ఇక సోషల్ మీడియాలో అయితే సిద్ధం సభ బాగా ట్రెండింగ్ అయింది. ఎక్స్‌ను ఓ ఊపు ఊపేసింది. ఎక్స్‌లో YsJaganAgain, WhyNot175, Siddham, YsJagan హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్ అవుతూ దేశంలో అగ్రస్థానంలో నిలిచాయి. ఇక సిద్ధం సభలో వైఎస్ జగన్ ప్రసంగాన్ని ఎక్స్‌లో 11 వేలమంది లైవ్ చూశారు. ఇది అతిపెద్ద రికార్డు.. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్వహించిన సభను ఇటీవల 2400 మంది ఎక్స్‌లో లైవ్ చూస్తే..మమతా బెనర్జీ టీఎంసీ లోక్‌సభ అభ్యర్ధుల ప్రకటన కార్యక్రమాన్ని 1200 మంది లైవ్ చూశారు. సిద్ధంలో వైఎస్ జగన్ ప్రసంగాన్ని అయితే ఏకంగా 11 వేల మంది ఎక్స్‌లో లైవ్ చూశారు.

మేదరమెట్లలో జరిగిన సిద్ధం సభ భారతదేశంలో ఇప్పటి వరకూ జరిగిన అతిపెద్ద రాజకీయ సభగా రికార్డు క్రియేట్ చేసింది. సిద్ధం సభ పోటోలు, హ్యాష్‌ట్యాగ్స్ సోషల్ మీడియాలో ఇంకా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.

Also read: Siddham Meeting: మీరు కృష్ణుడు.. నేను అర్జునుడిని.. కురుక్షేత్రానికి సిద్ధమా?: వైఎస్‌ జగన్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News