Causes Of Mood Swings In Females: మహిళలల్లో తరుచుగా హార్మోన్ల మార్పులు, శారీరక మార్పులు, ఒత్తడి కారణంగా పురుషుల కంటే ఎక్కువగా మానసిక స్థితి మార్పులను అనుభవిస్తారు. ముఖ్యంగా ఈ మూడ్ స్వింగ్స్ అనేది పీరియడ్స్ సమయంలో చోటు చేసుకుంటాయి. దీని వల్ల మహిళలు చిరాకుగా , కోపంగా, బాధపడుతూ ఉంటారు. అయితే ఈ మూడ్ స్వింగ్స్ సాధారణం అయినప్పటికీ, అవి తీవ్రంగా ఉంటే రోజువారీ జీవితంలో జోక్యం చేసుకుంటే, అది ఒక అంతర్లీన సమస్య సంకేతం కావచ్చని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. అలసలు మూడ్ స్వింగ్స్ ఎందుకు వస్తాయి, మూడ్ స్వింగ్స్ కారణాలు ఏంటి, అనే ప్రశ్న ప్రతిఒక్కరిలో కలుగుతుంది. దీనికి గల కారణాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మూడ్ స్వింగ్స్ చోటు చేసుకోవడానికి ముఖ్య కారణాలు:
హార్మోన్ల మార్పులు:
పీరియడ్స్, గర్భం, ప్రసవం సమయంలో హార్మోన్ల స్థాయిలలో ఏర్పడే మార్పులు మూడ్ స్వింగ్స్ లకు దారితీస్తాయి.
శారీరక మార్పులు:
నిద్రలేమి, పోషకాహార లోపం వ్యాధి మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి.
సామాజిక ఒత్తిళ్ళు:
పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు సంబంధ సమస్యలు మూడ్ స్వింగ్స్ కు దోహదం చేస్తాయి.
మానసిక ఆరోగ్య పరిస్థితులు:
డిప్రెషన్, ఆందోళన బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక ఆరోగ్య పరిస్థితులు కారణమవుతాయి.
జీవనశైలి:
పని ఒత్తిడి, సరిగా నిద్రపోవడం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల మూడ్ స్వింగ్‌కు దారీ తీస్తాయి.
ఈ మూడ్ స్వింగ్స్‌కు నివారణలు:
ఆరోగ్యకరమైన జీవనశైలి:
తగినంత నిద్ర, పోషకాహార లోపం నివారణ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఒత్తిడిని నిర్వహించడం వల్ల మూడ్ స్వింగ్స్ ను నివారించడంలో సహాయపడతాయి.
హార్మోన్ల చికిత్స:
రుతువిరతి లక్షణాలను తగ్గించడానికి లేదా రుతుచక్రం మానసిక స్థితిపై ప్రభావాన్ని తగ్గించడానికి హార్మోన్ల చికిత్స సహాయపడవచ్చు.
మానసిక ఆరోగ్య చికిత్స:
డిప్రెషన్, ఆందోళన లేదా బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక ఆరోగ్య పరిస్థితులకు చికిత్స మానసిక స్థితి మార్పులను నియంత్రించడంలో సహాయపడుతుంది.
మీరు మానసిక స్థితి మార్పులతో బాధపడుతుంటే, మీ వైద్యుడితో మాట్లాడటం చాలా ముఖ్యం. వారు మీ లక్షణాలకు కారణాన్ని నిర్ధారించడంలో మీకు సరైన చికిత్సను అందించడంలో సహాయం చేయగలరు. దీంతో పాటు మీరు పోషక ఆహారం తీసుకోవడం చాలా అవసరం. దీని వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు ఎలాంటి సమస్యల బారిన పడకుండా ఉంటారు.
Also read: Ramadan Diet: ఉపవాసాల్లో ఎలాంటి డైట్ ఉండాలి, మధుమేహంం వ్యాధిగ్రస్థులు ఏం చేయాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712