2024 Chandra Grahan effect on Zodiac Signs: సాధారణంగా శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు సూర్య, చంద్రగ్రహణాలను ఖగోళ దృగ్విషయాలు పేర్కొంటారు. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రహణాలకు, మనిషి జీవితాలకు ముడిపెడతారు జ్యోతిష్య నిపుణులు. హిందువులైతే వీటిని అశుభకరంగా భావిస్తారు. ఎందుకంటే ఈ గ్రహణాలు మనిషి జీవితంపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయని వారి నమ్మకం. అందుకే ఈ గ్రహణ కాలంలో ఎలాంటి పూజలు గానీ, శుభకార్యాలు గానీ చేయరు.
మరో నాలుగు రోజుల్లో చంద్రగ్రహణం రాబోతుంది. మార్చి 25న హోలీ పండుగ రోజే ఈ గ్రహణం రావడం విశేషం. దీంతో ఈ చంద్ర గ్రహణానికి మరింత ప్రాముఖ్యత ఏర్పడింది. హోలీ రోజు ఏర్పడే చంద్రగ్రహణం కొన్ని రాశులవారి జీవితాల్లో మార్పులు తీసుకురాబోతుంది. వీరు కెరీర్, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. అంతేకాకుండా వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ గ్రహణం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతునున్నారో తెలుసుకుందాం.
కన్య: కన్యారాశి వారికి చంద్రగ్రహణం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. మీరు తెలివితేటలతో అనుకున్న కార్యాన్ని పూర్తి చేస్తారు. జాబ్ చేసేవారు ప్రమోషన్ కు సంబంధించిన శుభవార్త వింటారు. నలుగురిలో మీ గుర్తింపు పెరుగుతుంది. మీ కుటుంబంలో సంతోషం తాండవిస్తోంది. మీరు పెద్ద బిజినెస్ డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది.
మేషం: మార్చి 25న ఏర్పడబోయే చంద్రగ్రహణం మేషరాశి వారి కెరీర్ ను మలుపు తిప్పుతుంది. వీరు అనుకున్నది సాధిస్తారు. ఎదురుచూస్తున్న ప్రమోషన్ వస్తుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. సంతానసుఖం కలుగుతుంది. పని పూర్తి చేసిన ఆనందాన్ని పొందుతారు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కంటే మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంది.
వృషభం: హోలీ నాడు సంభవించబోయే చంద్రగ్రహణం వల్ల వృషభరాశి వారిని అదృష్టం వరిస్తుంది. వీరు టేకాప్ చేసిన ప్రతి ప్రాజెక్టు సక్సెస్ పుల్ గా పూర్తి చేస్తారు. ఆఫీసులో వీరి పొజిషన్ తోపాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. బిజినెస్ చేసేవారు ఇంతకముందు ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE TELUGU NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Astrology: రేపటి నుండి ఈ 4 రాశుల వారి కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది.. మీ రాశి ఉందా?
Also Read: Ketu Transit 2024: 286 రోజుల పాటు ఈ రాశులవారికి లాభాలే లాభాలు.. డబ్బే, డబ్బు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి