దేవేగౌడతో చంద్రబాబు భేటీ ; బీజేపీని ఓడించే ఫార్ములాపై చర్చ 

                                 

Last Updated : Nov 8, 2018, 04:25 PM IST
దేవేగౌడతో చంద్రబాబు భేటీ ; బీజేపీని ఓడించే ఫార్ములాపై చర్చ 

బెంగళూరు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు షెడ్యూల్ ప్రకారం మాజీ ప్రధాని, జేడీయూ నేత దేవేగౌడతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు బీజేపీని ఓడించే ఫార్ములాపై చర్చలు జరుపుతున్నారు. వచ్చే  ఎన్నికల నాటికి బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి...ఇందుకు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి అనే దానిపై చర్చ జరిపినట్లు సమాచారం. ఈ సందర్భంలో ఇటీవలే జరిగిన ఉప ఎన్నికల్లో జేడీయు-కాంగ్రెస్ కూటమి విజయం సాధించిన నేపథ్యంలో దేవేగౌడను చంద్రబాబు అభినందనలు తెలిపారు. అలాగే రాష్ట్రంలో నిర్వహించ తలపెట్టిన బీజేపీ వ్యతిరేక ' ధర్మపోరాట దీక్ష ' సభకు దేవేగౌడకు ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో చంద్రబాబుతో పాటు ఆర్ధిక మంత్రి యనమలతో పాటు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ కూడా ఉన్నారు

బీజేపీని వ్యతిరేకించే జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలతో మాట్లాడేందుకు వరుస భేటీలు నిర్వహిస్తున్న చంద్రబాబు... ఈ రోజు బెంగళూరులో మాజీ ప్రధాని దేవేగౌడను ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే రెండు సార్లు ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు బీజేపీయేతర పక్షాలను ఏకం చేసే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు బీఎస్సీ చీఫ్ మాయవతి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎల్ జేడీ చీఫ్ శరద్ యాదవ్, జేఎంఎం చీఫ్ ఒమర్ అబ్దుల్లా పాటు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ తదితర నేతలతో భేటీ అయ్యారు. తాజాగా మాజీ ప్రధాని దేవేగౌడతో భేటీ కావడంపై గమనార్హం . జాతీయ రాజకీయాలను ప్రభావితం సత్తా ఉన్న చంద్రబాబు,దేవేగౌడ భేటీపై జాతీయ మీడియా ప్రత్యేక పోకస్ పెట్టింది. 

Trending News