Maharashtra deputy speaker jumps off third floor video: మహారాష్ట్ర రాజకీయాలు రచ్చగా మారాయి. ఈ క్రమంలో కొన్నిరోజులుగా మహారాష్ట్రలో రిజర్వేషన్ లో అంశం వార్తలలో ఉంటుంది. గిరిజన తెగకు సంబంధించి రిజర్వేషన్ విషయంలో సచివాలయంలో రిజర్వేషన్ లు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో.. అజిత్ వర్గానికి చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యేతోపాటు, డిప్యూటీ స్పీకర్ నరహారి ఝిర్వాల్, సచివాయంలోని మూడో అంతస్తు నుంచి కిందకు దూకారు.
#WATCH | NCP leader Ajit Pawar faction MLA and deputy speaker Narhari Jhirwal jumped from the third floor of Maharashtra's Mantralaya and got stuck on the safety net. Police present at the spot. Details awaited pic.twitter.com/nYoN0E8F16
— ANI (@ANI) October 4, 2024
జీర్వాల్‌తో పాటు బీజేపీ ఎంపీ హేమంత్ సవ్రా, ఎమ్మెల్యేలు కిరణ్ లహమతే, హిరిమాన్ ఖోస్కర్, రాజేష్ పటేల్ కూడా సేఫ్టీ నెట్‌లపై దూకిన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా అక్కడున్న భద్రత సిబ్బంది ఆశ్చర్యపోయారు. వెంటనే అక్కడికి చేరుకుని వారిని సెఫ్ చేశారు.
కానీ అక్కడ ఇదివరకు భవనం సెఫ్టీ కోసం నెట్ ను ఏర్పాటు చేశారు. దీంతో డిప్యూటీ స్పీకర్ ఆ నెట్లోకి పడిపోయారు. వెంటనే భద్రత సిబ్బంది,పోలీసులు అక్కడికి చేరుకుని వారికి కాపాడారు. గిరిజన తెగ అయి ధంగర్ కమ్యునిటీనీ షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) రిజర్వేషన్ కేటగిరిలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ వారు ఈ నిరసనలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. మరోవైపు అక్కడ నెట్ లు లేకుంటే పరిస్థితి ఏంటని కూడా పలువురు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. కొన్ని రోజులుగా గిరిజన తెగకు సంబంధించి రిజర్వేషన్ ల అంశం మహారాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారంగా మారింది. దీనిపై అధికార, అపోసిషన్ పార్టీలు నువ్వా.. నేనా..అన్న విధంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొంత డిప్యూటీ స్పీకర్ చేసిన పని ప్రస్తుతం సెక్రెటెరియట్ లో అందరిని టెన్షన్ కు గురిచేసిందని చెప్పుకొవచ్చు. కొంత మంది దీనిపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.