AP Elections 2024: ఏపీలో త్వరలో జరిగే ఎన్నికలకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుంటే ప్రతిపక్షాలు తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమిగా రంగంలో దిగుతున్నాయి. వైసీపీ ఇప్పటికే పూర్తి స్థాయిలో అభ్యర్ధుల్ని ప్రకటిస్తే టీడీపీ-జనసేనలు కొన్ని స్థానాలు మినహా మిగిలిన అభ్యర్ధుల్ని ప్రకటించింది. ఇక బీజేపీ అదికారికంగా ప్రకటించకపోయినా ఏయే స్థానాల్లో ఎవరు పోటీ చేసేది దాదాపుగా నిర్ధారణయింది.
ఏపీలో పొత్తులో భాగంగా బీజేపీ 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. పార్టీలో సీనియర్లు కొంతమంది లోక్‌సభ కోసం ప్రయత్నించగా పార్టీ అధిష్టానం మాత్రం అసెంబ్లీకు పోటీ చేయించాలని నిర్ణయించింది. ఒక్క అనపర్తి స్థానం విషయంలోనే ఇంకా సందిగ్దత కొనసాగుతోంది. మిగిలిన అన్ని స్థానాల్లో ఎవరు ఎక్కడనేది క్లారిటీ వచ్చింది.
ఏపీలో బీజేపీ లోక్‌సభ అభ్యర్ధులు
అరకు-కొత్తపల్లి గీత
అనకాపల్లి-సీఎం రమేశ్
రాజమండ్రి-పురంధరేశ్వరి
నరసాపురం-శ్రీనివాస వర్మ
తిరుపతి- వర ప్రసాద్
రాజంపేట-కిరణ్ కుమార్ రెడ్డి
ఏపీలో బీజేపీ అసెంబ్లీ అభ్యర్ధులు
ఎచ్చెర్ల-నడికుదిటి ఈశ్వర్ రావు
విశాఖపట్నం నార్త్-విష్ణుకుమార్ రాజు
పాడేరు- ఉమా మహేశ్వరరావు
అనపర్తి-సోము వీర్రాజు లేదా మరెవరైనా
కైకలూరు-కామినేని శ్రీనివాస్ లేదా తపనా చౌదరి
విజయవాడ వెస్ట్-సుజనా చౌదరి
బద్వేలు-పనతల సురేష్
ఆదోని-పార్ధసారధి
జమ్మలమడుగు-ఆది నారాయణరెడ్డి
ధర్మవరం-వరదాపురం సూరిలేదా సత్యకుమార్
Also read: Mudragada Padmanabham: చంద్రబాబు, పవన్ ఓటమికి ఎందాకైనా వెళ్తాను
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook