Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడా తగ్గడం లేదు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్డడీలో విచారణ ఎదుర్కొంటూనే ఢిల్లీ పరిపాలనకు సంబంధించిన ఆదేశాలు జైలు నుంచే జారీ చేస్తూ చర్చనీయాంశంగా మారుుతున్నారు.
ఆప్ నేతలు ముందుగా చెప్పినట్టే జైలు నుంచే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరిపాలన సాగిస్తున్నారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ తరువాత ఈడీ కస్టడీలో తీసుకుని విచారణ చేస్తోంది. జైలు నుంచే పరిపాలన చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈడీ కస్డడీలో ఉండే ఢిల్లీ పరిపాలనకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా నీటి సమస్యలు, మొహల్లా ఆసుపత్రుల్లో ఉచిత మందులు, వైద్య పరీక్షలకు సంబంధించిన ఆదేశాలను ఆయా మంత్రులకు ఇచ్చారు. పేపర్, కంప్యూటర్ వంటి స్టేషనరీ, మౌళిక సదుపాయాల్లేకుండానే అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు ఎలా ఇస్తున్నారనేది ఈడీకు అర్ధం కాకుండా ఉంది. అందుకే అరవింద్ కేజ్రీవాల్ నుంచి ఆదేశాలు అందుకున్న మంత్రుల్ని కూడా విచారించాలని నిర్ణయించుకుంది. ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు కూడా అరవింద్ కేజ్రీవాల్ లేకుండా జరగనుండటం విశేషం. ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాల్లో వైద్యానికి సంబంధించిన అంశాలపై చర్చ జరగనుంది.
మరోవైపు ఈడీ కస్టడీ నుంచి పరిపాలన సాగించడంపై బీజేపీ మండిపడుతోంది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇంకోవైపు అరెస్ట్ అక్రమమంటూ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటీషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. ఈ పిటీషన్‌పై అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభిస్తుందా లేదా అనేది ఆసక్తి కల్గిస్తోంది.
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశంలోనే కాదు..ప్రపంచంలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు ఇతర పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు అమెరికా స్పష్టం చేయగా, ఈ కేసులో విచారణ పారదర్శకంగా ఉండాలని జర్మనీ అభిప్రాయపడింది.
Also read: Aadhar Card Download: మొబైల్ నంబర్ లేకున్నా ఇలా సింపుల్‌గా ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook