Sun and Saturn conjunction end effect: రాశిని ఛేంజ్ చేయడానికి ప్రతి గ్రహానికి కొంత టైం పీరియడ్ ఉంటుంది. మార్చి నెలలో కూడా కొన్ని గ్రహాలు తమ రాశులను మార్చి ఇతర గ్రహాలతో సంయోగాలను జరిపాయి. రీసెంట్ గా కుంభరాశిలో తండ్రీ కొడుకులైన సూర్యదేవుడు, శనిదేవుడు కలయిక ఏర్పడింది. అది మార్చి 14తోనే ముగిసింది. ప్రస్తుతం సూర్యభగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. దీని వల్ల మూడు రాశులవారు ఊహించని ఎనలేని ప్రయోజనాలను పొందబోతున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
కుంభ రాశి
ఇదే రాశిలో సూర్య మరియు శనిల మైత్రి ముగిసింది. దీంతో ఈ రాశి వారి జాతకం మారిపోయింది.. వీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ భారీగా పెరుగుతుంది. పెళ్లికాని ప్రసాదులకు వివాహం కుదురుతుంది. దంపతులు మధ్య గొడవలన్నీ తొలగిపోయి.. ప్రేమ పెరుగుతుంది. బిజినెస్ చేసేవారు ఎన్నో రెట్లు లాభాలను ఆర్జిస్తారు. మీరు టేకాఫ్ చేసిన ప్రతి ప్రాజెక్టు సక్సెస్ అవుతుంది.
మకరరాశి
సూర్యుడు మరియు శనిదేవుడు మైత్రి ముగియడం వల్ల మకరరాశి వారి సంపద వృద్ధి చెందుతుంది. మీరు ఫైనాన్షియల్ గా సెటిల్ అవుతారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోతాయి. మీరు అప్పుల ఊబి నుండి బయటపడతారు. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. మీ డ్రీమ్ నెరవేరుతుంది. మీ ధనం విపరీతంగా పెరుగుతుంది.
వృషభం
వృషభరాశి వారికి శనిదేవుడు మరియు సూర్యదేవుడు సంయోగం కావాల్సినంత ధనాన్ని ఇస్తుంది. నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న జాబ్ వస్తుంది. వ్యాపారస్తులు మునుపెన్నడూ చూడని లాభాలను పొందుతారు. ఉద్యోగస్తుల శాలరీ పెరగడంతోపాటు పదోన్నతి లభిస్తుంది. మీరు కెరీర్ లో సక్సెస్ అవుతారు. మీరు పేదరికం నుండి బయటపడతారు.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ప్రజల నమ్మకాలు మరియు ఇంటర్నెట్ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Budh Ast 2024: ఏప్రిల్ నెలలో ఈ 4 రాశుల జీవితాన్ని నాశనం చేయబోతున్న బుధుడు.. ఇందులో మీ రాశి ఉందా?
Also Read: Solar Eclipse 2024: వచ్చే నెలలో సంపూర్ణ సూర్యగ్రహణం.. మన దేశంపై ప్రభావం ఉంటుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి