Ranga Panchami 2024: ఇండోర్ లో జరిగే రంగ పంచమి పండుగకు లక్షల్లో జనాలు ఎందుకు వస్తారు.. అంత స్పెషల్ ఏంటి?

Rang Panchami Festival:  హిందులకు హోలీ తర్వాత ముఖ్యమైన పండుగలలో రంగ పంచమి ఒకటి. ఈ పండుగ హోలీ జరిగన ఐదు రోజుల తర్వాత వస్తుంది. దీనిని మన దేశంలో చాలా ప్రాంతాల్లో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ ఫేమస్ అయిన ప్రాంతం ఏదో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Last Updated : Mar 30, 2024, 04:54 PM IST
Ranga Panchami 2024: ఇండోర్ లో జరిగే రంగ పంచమి పండుగకు లక్షల్లో జనాలు ఎందుకు వస్తారు.. అంత స్పెషల్ ఏంటి?

Rang Panchami date and Significance: హిందువులకు ప్రతి నెలా ఏదో ఒక పండుగ ఉంటూనే ఉంటుంది. ఇప్పటికే ఈ నెలలో హోలీ ఫెస్టివల్ రాగా.. ఇవాళ మరో వేడుక వచ్చింది. అదే రంగ పంచమి పండుగ. దీనిని హోలీ జరిగన ఐదు రోజుల తర్వాత జరుపుకుంటారు. ఈ పండుగను చైత్ర మాసంలోని పంచమి తిథి నాడు చేసుకుంటారు. ఈ పండుగ రాధాకృష్ణులకు అంకితం చేయబడింది. ఈరోజునే శ్రీ కృష్ణుడు మరియు రాధా దేవి భూమిపైకి వచ్చి హోలీ ఆడతారని ప్రజల నమ్మకం. ఈ రోజున రాధాకృష్ణులు పూజిస్తే.. మీరు కోరిన కోర్కెలు నెరవేరుతాయి. 

అక్కడ జరిగే వేడుకకు లక్షల్లో జనాలు..

ఈ రంగ పంచమి పండుగను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చాలా వైభవంగా జరుపుకుంటారు. దీనికి ప్రపంచ నలుమూలల నుండి లక్షలాధి భక్తులు వస్తారు. ఈ పండుగ సందర్భంగా జరిగే ఊరేగింపును గర్ అని పిలుస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విదేశాల నుంచి కూడా చాలా మంది వస్తుంటారు. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం భారీగా వచ్చే ప్రజల కోసం ఏర్పాట్లు చేసింది. 

Also Read: Surya Grahan 2024: ఏప్రిల్ 08న మెుదటి సూర్యగ్రహణం.. ఈ 4 రాశులకు కష్టకాలం..

శతాబ్ధాలుగా కొనసాగుతున్న సంప్రదాయం..
గర్‌ని తీసుకెళ్లే ప్రధాన మార్గం గౌరకుండ్ కూడలి నుండి రాజ్‌వాడ వరకు ఉంది. దారిపొడవునా రంగులతో అలంకరిస్తారు. అంతేకాకుండా ఈ గర్ ను నగరంలోని పలు ప్రాంతాల ద్వారా తీసుకెళతారు. ఈ సంప్రదాయం హోల్కర్ రాజవంశం కాలం నుండి కొనసాగుతోందని అక్కడి వారు చెబుతారు. ఈ రోజున హోల్కర్ వంశానికి చెందిన రాజవంశీయులు సాధారణ ప్రజలతో కలిసి హోలీ ఆడేవారట. సోదరభావాన్ని పెంపొందించడమే దీని యెుక్క పరమార్థం అక్కడి వారు నమ్ముతారు. రాజవంశం అంతమైనా శతాబ్దాలుగా ఈ సంప్రదాయం పాటిస్తూ వస్తున్నారు అక్కడి ప్రజలు. 

Also Read: Astrology - Lakshmi Narayana Budhaditya Rajayoga 2024: 100 యేళ్ల తర్వాత ఈ రాశుల వారికీ డబుల్ రాజయోగం.. ఈ 3 రాశుల వారి సుడి తిరిగినట్లే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

.

Trending News