Astrology - Lakshmi Narayana Budhaditya Rajayoga 2024:మీనరాశిలో బుధ గ్రహ వక్రగమనం వల్ల ఈ రాశిలో లక్ష్మీ నారాయణ యోగం, బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. దీనివల్ల ఈ రాశుల వారికీ అనేక అద్భుత ప్రయోజనాలు కలుగనున్నాయి. ఏప్రిల్ 2న నవగ్రహాల రాకుమారుడు బుధుడు ఏప్రిల్ 2న మేషరాశిలోకి సంచరించనున్నాడు. ఆ తర్వాత ఏప్రిల్ 9న బుధుడు మేషరాశి నుంచి మీన రాశిలోకి వక్రమగనంలో ప్రయాణిస్తాడు.ఇక అప్పటికే మీనరాశిలో శుక్రుడు, సూర్యుడు సంచరిస్తున్నాడు. బుధుడి రాకతో ఎంతో అద్భుతమైన లక్ష్మీ నారాయణ బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. మీనరాశిలో శుక్రుడు, బుధుడు కలయిక లక్ష్మీ నారాయణ యోగాన్ని సూచిస్తుంది. అలాగే రవి, బుధుడు కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. దీని ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే అని చెప్పాలి. కొత్త ఆదాయ మార్గాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి.
అయితే ఈ యోగం వల్ల ఈ మూడు రాశుల వారికీ అనేక ప్రయోజనాలు.. అద్భుత యోగాలు కలగనున్నాయి. ఇంతకీ ఈ యోగం వల్ల ఎలాంటి ఫలితాలు అందుకుంటాయో చూద్దాం..
వృషభ రాశి..
లక్ష్మీ నారాయణ బుధాదిత్య రాజయోగం వల్ల వృషభరాశి వారికి మంచి లాభాలు కలగనున్నాయి. ఈ రెండు రాజయోగాలు మీ రాశి యొక్క లాభా స్థానమైన 11వ ఇంట జరుగుతున్నాయి. దీంతో వృషభ రాశి వారికీ అద్భుత ప్రయోజనాలు కలుగనున్నాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి.
మీనరాశి..
మీన రాశి వారికీ లక్ష్మీ నారాయణ బుధాదిత్య రాజ్యయోగం వల్ల ఈ రాశుల వారికీ పట్టిందల్లా బంగారం అన్నట్టుగా సాగుతోంది. ఈ యోగం పనిచేసే ప్రదేశంతో పాటు వ్యాపారంలో అనుకోని లాభాలు అందుకుంటారు. అంతేకాదు కెరీర్‌లో ఎన్నో అద్భుత విజయాలు అందుకునే అవకాశాలున్నాయి. అంతేకాదు నిరుద్యోగులు ఉద్యోగ లాభం.. మరియు వ్యాపారులకు మంచి లాభాలు కలుగుతాయి.
సింహ రాశి..
ఈ రెండు రాజయోగాల ద్వారా సింహ రాశి వారికి ఎన్నో అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. ఎందుకంటే ఈ రాజయోగం మీ రాశిలోని ఎనిమిది ఇంట్లో కలగనుంది. అనుకున్న కోరికలు నెరవేరే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఈ రాజయోగం మీ రాశిలోని ఎనిమిదో ఇంట్లో ఏర్పడుతోంది. ఈ సమయంలో మీరు కొత్త వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారంలో ఎన్నో అనుకూల ప్రయోజనాలు జరగనున్నాయి. కుటుంబ సభ్యుల సపోర్ట్ మీకు తోడుగా ఉంటుంది. మీ ఆరోగ్యం సహకరిస్తుంది.
Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
Also Read: Egg Murder: 'కోడిగుడ్డు'తో చనిపోయిన మహిళ.. ప్రేమ వ్యవహారమే కారణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook