Lungs Detox Drinks: మీ ఊపిరితిత్తులను ఒక్కసారిగా క్లీన్ చేసే 6 డ్రింక్స్.. ఇంట్లోనే చేసుకోండి..

Lungs Detox Drinks: సరైన జీవనశైలిని పాటించకపోవడం, వాయుకాలుష్యం వల్ల మన ఊపిరితిత్తులు పాడవుతాయి. దీనికి ఊపిరితిత్తులు శుభ్రం చేయడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా ఊపిరితిత్తులను డిటాక్సిఫై చేసే డ్రింక్స్ తీసుకోవాలి.

Written by - Renuka Godugu | Last Updated : Mar 31, 2024, 06:07 PM IST
Lungs Detox Drinks: మీ ఊపిరితిత్తులను ఒక్కసారిగా క్లీన్ చేసే 6 డ్రింక్స్.. ఇంట్లోనే చేసుకోండి..

Lungs Detox Drinks: సరైన జీవనశైలిని పాటించకపోవడం, వాయుకాలుష్యం వల్ల మన ఊపిరితిత్తులు పాడవుతాయి. దీనికి ఊపిరితిత్తులు శుభ్రం చేయడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా ఊపిరితిత్తులను డిటాక్సిఫై చేసే డ్రింక్స్ తీసుకోవాలి. ఈరోజు ఇంట్లో తయారు చేసుకునే లంగ్స్ డిటాక్స్ డ్రింక్స్‌ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

గ్రీన్ టీ..
గ్రీన్ టీ లో కెటాచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. గ్రీన్ టీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించే లక్షణాలు ఉంటాయి. ఇవి మన ఊపిరితిత్తులను డిటాక్సిఫై చేస్తాయి. ఇందులోని పాలిఫెనల్స్ రెస్పరేటరీ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. 

నిమ్మకాయ నీరు..
నిమ్మకాయలో విటమిన్ సీ ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యానికి సహాయపడతాయి. ఇమ్యూనిటీని పెంచి ఆక్సిడెటీవ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. అంతేకాదు ఇందులోని ఆల్కలైన్ ఊపిరితిత్తుల్లో మ్యూకస్ పెరగడాన్ని తగ్గిస్తుంది.

అల్లం, పసుపు టీ..
అల్లం, పసుపు కలిపితే యాంటీ ఇన్ఫ్లమేటరీ పానియం సిద్ధమవుతుంది. అల్లం ఊపిరితిత్తుల్లో గాలి తీసుకోవడానికి అడ్డంకులను తొలగిస్తుంది. పసుపులోని కర్కూమిన్ ఊపిరితిత్తుల ఇన్ప్లమేఫ్ తగ్గించి డీటాక్సిఫికేషన్‌కు సహాయపడుతుంది.

ఇదీ చదవండి: రాగిరొట్టె డయాబెటిక్ రోగులకు దివ్యౌషధం.. రక్తంలో చక్కెర స్థాయిలను పెరగనివ్వదు...

పిప్పర్మెంట్ టీ..
ఇది పుదీనా కలిగి ఉంటుంది. ఇది గాలి మార్గాన్ని క్లీన్ చేస్తుంది. ఇందులో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు రెస్పరేటరీ ఇన్పెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది.

పైనాపిల్, కీరదోస..
ఇది మంచి రిఫ్రెషింగ్‌ డ్రింక్. ఇది మనల్ని హైడ్రేటెడ్‌ గా ఉంచుతుంది. పైనాపిల్‌లో బ్రోమలైన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గించి ఊపిరితిత్తుల రెస్పరేటరీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.  

బీట్‌ రూట్‌ జ్యూస్..
బీట్‌ రూట్ లో నైట్రేట్‌ కంటెంట్‌ ఉంటుంది. ఇది మన ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ స్థాయిలను పెంచుతాయి. దీంతో రక్తప్రసరణ కూడా మెరుగవుతుంది. బీట్‌ రూట్‌ లోని యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు ఊపిరితిత్తుల కణాలను డ్యామేజ్ కాకుండా ఫ్రీ రాడికల్స్‌ నుంచి కాపాడతాయి.

ఇదీ చదవండి: ఆరోగ్యాన్నిచ్చే అక్రోట్లు.. డైలీ ఇలా తింటే మీ శరీరంలో బిగ్ మిరాకిల్..

క్యారట్‌ యాపిల్..
క్యారట్‌ లో కూడా విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయ.ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యానికి తోడ్పడతాయి. దీనికి అల్లం జోడించడం వల్ల కాస్త స్పైసీనెస్ యాడ్ అవుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News