YS Sharmila: ఏపీ రాజకీయాల్లో కీలకపరిణామం.. ఆ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల..

YS Sharmila: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ను ఎంపీగా పోటీచేసే స్థానంను ప్రకటించింది. దీంతో ఏపీ రాజకీయాలు మరింత వెడెక్కాయి.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 1, 2024, 02:51 PM IST
  • కడప నుంచి ఎన్నికల బరిలో వైఎస్ షర్మిల..
  • వైఎస్ అవినాష్ రెడ్డికి చెక్ పెట్టేలా కాంగ్రెస్ పావులు..
YS Sharmila: ఏపీ రాజకీయాల్లో కీలకపరిణామం.. ఆ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల..

AP Congress Chief YS Sharmila Contesting AS MP From Kadapa Constituency: కేంద్ర ఎన్నికం సంఘం ఇప్పటికే నాలుగు రాష్ట్రాలు, లోక్ సభ ఎన్నికలకు గాను షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే ఈడీ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం, బీఆర్ఎస్ నుంచి భారీగా కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఏపీలో అధికార వైఎస్సార్సీపీ సిద్ధం సభలతో ప్రజల్లోకి వెళ్తుంది. తమ ప్రభుత్వం పేదలకు అందించిన పథకాలను చెప్పుకొని మరోసారి అవకాశం ఇవ్వాలంటూకూడా అభ్యర్థిస్తుంది. ఇక అదే క్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేనలు పొత్తులు కుదుర్చుకున్నాయి. ఎంపీ అభ్యర్థులను కూడా దాదాపుగా ప్రకటించేశాయి.

Read More: Mamata Banerjee: బీజేపీకి 400 కాదు కదా.. ఆ సీట్లు కూడా రావంటూ ఘాటువ్యాఖ్యలు చేసిన మమతా..

ఈక్రమంలో తాజాగా, ఏపీలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటనపై కొన్ని నెలలుగా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఏపీ రాజకీయాల్లో వైఎస్సార్సీపీని ఉతికి ఆరేస్తున్నారు. వైఎస్ జగన్ పాలనలో జరిగిన మోసాలు అవినితీని ఎండగడుతున్నారు. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తొలిసంతకం.. ప్రత్యేక హోదాపై ఉంటుందంటూ కూడా ప్రజల్లోకి వెళ్లి మరీ అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా, కాంగ్రెస్ హైకమాండ్ కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పేరును ఖరారు చేసింది. దీంతో కడప సిట్టింగ్ ఎంపీ, సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డినిఏ ఆమె ఢీకొట్టనున్నారు.

కాంగ్రెసై హైకమాండ్ పెద్దలు ఢిల్లీలో  సీఈసీ మీటింగ్ లో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ, ఎంపీ సీట్లలో అభ్యర్థుల లిస్ట్ పై క్దారీటీ మరికాసేపట్లో రానున్నట్లు సమాచారం. ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్‌ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రజల్లో అవినాష్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని భావించిన కాంగ్రెస్ హైకమాండ్, వైఎస్ షర్మిలకు టికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Read More: Phone Addiction: ఇదేం విడ్డూరం.. చిన్నారిని ఆ పనిచేస్తూ ఫ్రిడ్జీలో పెట్టేసిన తల్లి.. వైరల్ వీడియో..

ఇక కడపలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఎంపీ అభ్యర్థులుగా బరిలో దిగుతుండటం రాజకీయాల్లో తీవ్ర సంచనలంగా మారింది. ప్రస్తుతం కడపలో.. షర్మిల వర్సెస్ అవినాష్ రెడ్డిగా రాజకీయాలు మరింత హీట్ ను పుట్టించేవిగా మారుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News