Shukra Dev Effect: ఈ రాశుల వారికి డిసెంబర్ నుంచి గుడ్ టైమ్‌ స్టార్ట్.. దరిద్ర దేవతకు బైబై.. జాక్‌పాట్ కొట్టడం ఖాయం!

Shukra Dev Effect: డిసెంబర్ నెలలో శుక్రుడు రెండుసార్లు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా ఈ క్రింది రాశుల వారిపై గణనీయమైన ప్రభావం పడుతుంది. దీంతో వీరు అద్భుతమైన ఆర్థిక లాభాలు పొందడమే కాకుండా ఊహించని ప్రయోజనాలను పొందుతారు.  

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Nov 17, 2024, 09:57 AM IST
Shukra Dev Effect: ఈ రాశుల వారికి డిసెంబర్ నుంచి గుడ్ టైమ్‌ స్టార్ట్.. దరిద్ర దేవతకు బైబై.. జాక్‌పాట్ కొట్టడం ఖాయం!

Shukra Dev Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు వాటి సమయాన్నిబట్టి ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తూ.. అప్పుడప్పుడు తిరోగమనం కూడా చేస్తాయి. ఈ గ్రహ సంచారాలు మనుషుల జీవితాలపై ప్రత్యేకమైన ఎఫెక్ట్ను చూపుతాయి.. దీంతో వ్యక్తిగత జీవితంలో ప్రతికూల, అనుకూల మార్పులు వస్తాయి. అయితే ఈ ఏడాది చివరి నెలైనా డిసెంబర్‌లో అద్భుతం జరగబోతోంది. ఐశ్వర్యం, సుఖ సంతోషాలకు సూచికగా భావించే.. శుక్రుడు రెండుసార్లు రాశి సంచారం చేయబోతున్నాడు. ఇలా ఈ గ్రహం చాలా తరచుగా రెండుసార్లు సంచారం చేస్తూ ఉంటుంది. మొదట శుక్ర గ్రహం మకర రాశిలోకి ప్రవేశించి ఆ తర్వాత శని సొంత రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది. అదృష్ట గ్రహంగా పరిగణించే సూర్యుడు ఇలా రెండు సార్లు సంచారం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది.

Add Zee News as a Preferred Source

శుక్రుడి సంచారం ఈరోజే: 
తెలుగు క్యాలెండర్ ప్రకారం శుక్రుడు ఈ సంవత్సరం చివరి నెలలో రెండుసార్లు రాశిని మార్చుకోబోతున్నాడు. మొదటగా ఈ గ్రహం డిసెంబర్ రెండవ తేదీన శని పాలించే మకర రాశిలోకి సంచారం చేయగా.. రెండవసారి డిసెంబర్ 28వ తేదీన శని అధిపతిగా వ్యవహరించే కుంభరాశిలోకి ప్రవేశించబోతోంది. దీని కారణంగా ఈ క్రింది రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది.

ఈ రాశుల వారికి చాలా ప్రయోజనకరం: 
వృషభ రాశి: 

వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు డిసెంబర్ నెలలో జరిగే గ్రహ సంచారం కారణంగా విశేష శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ సమయంలో ఎక్కువగా ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే వృత్తి, వ్యాపార పరమైన జీవితాల్లో పురోగతి లభించడమే కాకుండా బోలెడు లాభాలు కలుగుతాయి. అలాగే వీరి ఆర్థిక పరిస్థితులు కూడా బలంగా మారతాయి. అంతేకాకుండా వ్యాపారాలు స్థిరంగా మారి లాభాలు రావడం ప్రారంభమవుతాయి. భాగస్వామ్య వ్యాపారులు ఈ సమయంలో అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా విపరీతమైన ఆనందం లభించే అవకాశాలు ఉన్నాయి. 

తులారాశి: 
తులారాశి వారిపై కూడా శుక్రుడి ప్రభావం పడుతుంది. దీని కారణంగా ఈ రాశి వారు వ్యక్తిగత జీవితంలో సానుకూల ప్రభావాన్ని కలిగి ఉంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు లభించడమే కాకుండా కార్యాలయాల్లో అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే డబ్బు సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. దీని కారణంగా ఆర్థిక పరిస్థితులు కూడా గణనీయంగా మెరుగుపడతాయి. అలాగే కుటుంబంలో ఆనందం, శాంతి కూడా విపరీతంగా పెరుగుతుంది. దీని కారణంగా కొన్ని రోజులపాటు ఎంతో ఆనందంగా జీవిస్తారు.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

మకర రాశి: 
మకర రాశి వారికి కూడా శుక్రుడు రెండుసార్లు సంచారం చేయడం కారణంగా విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి వారు అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు. దీని కారణంగా ఎలాంటి పనులు చేపట్టిన విశేష విజయాలు సాధిస్తారు. ఇక కష్టపడి పనులు చేసే వారికి ఈ సమయంలో సానుకూలమైన ఫలితాలు లభిస్తాయి. దాంపత్య జీవితంలో సంతోషం పెరగడమే కాకుండా గతంలో ఉన్న గొడవలు అన్నీ పరిష్కారం అవుతాయి. ఇక ఒంటరి జీవితం గడుపుతున్న వారికి ఈ సమయంలో వివాహ ప్రతిపాదనలు కూడా వస్తాయి. దీని కారణంగా పెళ్లిళ్లు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News