Rashmika Mandanna Birthday Special: 12 సంవత్సరాల పెద్దోడిని ప్రేమించిన రష్మిక.. అప్పట్లో ఆమె ప్రేమ ఒక సెన్సేషన్..

HBD Rashmika Mandanna: ఈరోజు రష్మిక తన 28వ పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆమె గురించి చాలా తక్కువ మందికి తెలిసిన ఒక ఆసక్తికర విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 5, 2024, 04:18 PM IST
Rashmika Mandanna Birthday Special: 12 సంవత్సరాల పెద్దోడిని ప్రేమించిన రష్మిక.. అప్పట్లో ఆమె ప్రేమ ఒక సెన్సేషన్..

Rashmika Mandanna: ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక. అందం.. అంతకంటే అందమైన అభినయంతో నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ . ఏప్రిల్ 5 2024న ఆమె తన 28వ పుట్టినరోజును జరుపుకుంటుంది.ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆమెకు అభిమానులు ,సినీ తారలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచారు.అయితే రష్మిక గురించి మనకు తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. మరి అదేమిటో ఓ లుక్కేద్దాం పదండి..

సౌత్ నుంచి బాలీవుడ్ వరకు తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని ఈ భామ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన మ్యాజిక్ చూపిస్తోంది. రీసెంట్ గా విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ యానిమల్  తర్వాత ఆమెకు బాలీవుడ్ లో కూడా క్రేజ్ విపరీతంగా పెరిగింది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. పుష్ప మూవీ అయితే రష్మిక కెరీర్ లో ఓ మైలురాయిగా మిగిలిపోతుంది. రష్మిక ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన 6 సంవత్సరాలలో ఎన్నో అద్భుతమైన హిట్ చిత్రాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా నిలిచింది .

ఈ ముద్దుగుమ్మ కేవలం సినిమాల విషయంలోనే కాక తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాల గురించి అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంది. రష్మిక నటించిన మొదటి చిత్రం 'కిరిక్ పార్టీ’ తోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. తొలి సినిమా నుంచే యూత్ ఆమె మాయ లో పడిపోయారు. ఆ తర్వాత గీత గోవిందం మూవీ ట్రెడిషనల్ బ్యూటీ గా గుర్తింపు తెచ్చింది. పుష్ప మూవీ సక్సెస్ తర్వాత బాలీవుడ్ మార్కెట్ పై కన్నేసిన ఈ బ్యూటీ గుడ్ బై మూవీతో హిందీలో కూడా అడుగుపెట్టింది. భాషతో సంబంధం లేకుండా సినీ ఇండస్ట్రీలో టాప్ లో కొనసాగుతున్న హీరోయిన్ల లిస్టులోకి రష్మిక తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంలో బిజీగా ఉంది. ఇక ఆ విషయం పక్కన పెడితే విజయ్ దేవరకొండ కి రష్మికకు మధ్య ఏదో ఉంది అన్న లొల్లి సోషల్ మీడియాలో ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. ఇంకా ఈ విషయంపై ఇద్దరిలో ఎవరు స్పష్టత ఇవ్వలేదు.. అయినా ఫాన్స్ ఈ ఇద్దరు ఒకటైతే చూడాలని భావిస్తున్నారు.

 రష్మిక ఫస్ట్ లవ్ కూడా ఓ పెద్ద కాంట్రవర్సీ అన్న విషయం మీకు తెలుసా?ఏడేళ్ల క్రితం రష్మిక తన కంటే 12 ఏళ్లు పెద్ద వయసు ఉన్న రక్షిత్ శెట్టితో ప్రేమాయణం నడిపింది. అతని పెళ్లి కూడా చేసుకోవాలని భావించిన రష్మిక 2017లో తమ రిలేషన్షిప్ గురించి స్వయంగా అనౌన్స్ చేసింది. ఇది జరిగిన కొన్ని రోజులకి వీళ్ళు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. అయితే ఆ తర్వాత తన కెరీర్ పై దృష్టి పెట్టాలి అనే ఉద్దేశంతో రష్మిక ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంది అని టాక్. అయితే ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ అయింది అన్న విషయంపై రష్మిక ఇప్పటివరకు స్పందించలేదు.

Also Read: YS Jagan: మళ్లీ ముఖ్యమంత్రి అవుతా.. వలంటీర్‌ వ్యవస్థపైనే తొలి సంతకం చేస్తా: వైఎస్‌ జగన్‌

Also Read: Amanchi Krishna Mohan: వైఎస్ జగన్‌కు భారీ షాక్‌.. వైసీపీకి ఆమంచి కృష్ణ మోహన్‌ రాజీనామా

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News