Women Seminaked and Brutally Attacked In Punjab: మహిళలు భద్రత ప్రస్తుతం పెనుసవాల్ గా మారింది. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై అమానవీయకర దాడులు మాత్రం ఆగటం లేదు. కొన్ని చోట్ల ప్రేమపేరుతో అమ్మాయిలను, మహిళలను వేధిస్తుంటారు. వీరి మాట వినకపోతే ఎంతటి దారుణానికి ఒడిగట్టడానికి కూడా వెనుకాడరు. అదే విధంగా మరికొన్ని చోట్ల మహిళలను పెళ్లి చేసుకుని కూడా కట్నం తేలేదని, అందంగా లేదని కూడా వేధింపులకు గురిచేస్తుంటారు. మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని కూడా దాడులు చేస్తుంటారు. ప్రేమించి ఇతరులను పెళ్లి చేసుకున్న కూడా వీరి క్రూరమైన దాడులు మాత్రం ఆగడం లేదు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఒక మహిళ కుమారుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, యువతికుటుంబ సభ్యులు ఆమెపై దాడిచేశారు. రోడ్డుమీద బట్టలు తీసేసి, నీచంగా ప్రవర్తించారు. ఈ ఘటన వార్తలలో నిలిచింది.
Read More: Snakes: ఇదేం విడ్డూరం.. పాముల్ని పెంచుకుంటున్న గ్రామస్థులు.. హనీ కలిగిస్తే అరెస్ట్ చేస్తారంట..
పంజాబ్ లోని తరన్ తారన్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. 55 ఏళ్ల మహిళలను వివస్త్రను చూసి అర్ధరాత్రి రోడ్డుమీద ఊరేగించారు. సదరు మహిళ కుమారుడి ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇది యువతి కుటుంబ సభ్యులు ఈ పైశాచిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. మహిళపై మూకుమ్మడిగా దాడికి పాల్పడి ఆమె బట్టలు విప్పేసి, అమానవీయంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా బెదిరింపులకు కూడా గురిచేసినట్లు తెలుస్తోంది. ఇంట్లో వారికి సదరు యువకుడితో ప్రేమ వివాహం అస్సలు ఇష్టంలేదు.
ఈక్రమంలో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి యువతీకుటుంబ సభ్యులు వీరిపై కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే..యువకుడి తల్లిపై మూకుమ్మడిగా దాడిచేసినట్లు సమాచారం. బాధితురాలు ఘటన తర్వాత స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Read More: Bengaluru Chariot Collapses: ఘోరం.. ఒక్కసారిగా కుప్పకూలిన 120 అడుగుల రథం.. వీడియో వైరల్..
మహిళ పాక్షిక నగ్న స్థితిలో ఉన్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటికైతే ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఘటనపై.. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (తార్న్ తరణ్) అశ్విని కపూర్ మాట్లాడుతూ, ఘటనలో పాల్గొన్న నిందితులందరినీ పట్టుకోవడానికి పోలీసులు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేయగా, మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన మాత్రం పంజాబ్ లో సంచలనంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook