Bengaluru Chariot Collapses: ఘోరం.. ఒక్కసారిగా కుప్పకూలిన 120 అడుగుల రథం.. వీడియో వైరల్..

Bengaluru Chariot Collapses: బెంగళూరు (రూరల్)లోని హుస్కూర్ మద్దూరమ్మ దేవాలయం జాతర వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాలన నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయంలోని రథోత్సవం వేడుక ప్రారంభమైంది. కానీ ఇంతలో ఊహించని ఘటన జరిగింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 6, 2024, 10:23 PM IST
  • హుస్కూర్ మద్దూరమ్మ రథోత్సవంలో షాకింగ్ ఘటన..
  • కుప్పకూలిన 120 అడుగుల రథం..
Bengaluru Chariot Collapses: ఘోరం.. ఒక్కసారిగా కుప్పకూలిన 120 అడుగుల రథం.. వీడియో వైరల్..

karnataka 120 Foot Tall Huskur Madduramma Chariot Collapses: కొన్నిసార్లు ఉత్సవాలు, వేడుకల్లో అనుకొని ఘటనలు జరుగుతుంటాయి. ఇటీవల కేరళలోని ఒక ఆలయంలో ఉత్సవాలుజరుగుతుండగా, ఒక ఏనుగు మరో ఏనుగుపై దాడిచేసింది. దీంతో అక్కడున్న భక్తులంతా భయంతో పరుగులు పెట్టారు. ఈ ఘటన మాత్రం పెనుదుమారంగా మారింది. భక్తులు ఉత్సవాలకు పెద్ద ఎత్తున వస్తుంటారు. తామే ముందు దర్శించుకొవాలనే, ఆశతో కొన్నిసార్లు క్యూలైన్లతో ఎగబడుతుంటారు. దీంతో తొక్కిసలాట జరుగుతుంది. ఆలయంలో కూడా భక్తుల తప్పిదాలు, అధికారులు సరైన వసతులు కల్గజేయడంలో విఫలమైన అనేక సందర్భాలలో అనుకోని ఘటనలు జరిగిన ఘటనలు తరచుగా వార్తలలో ఉంటాయి. తాజాగా, ఇలాంటి ఒక షాకింగ్ ఘటన బెంగళూరులోని హుస్కూర్ మద్దూరమ్మ దేవాలయం జాతర వేడుకలో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

పూర్తి వివరాలు..

కర్ణాటకలో ఆలయ జాతర సందర్భంగా షాకింగ్ ఘటన జరిగింది. భక్తులు అమ్మవారి రథాన్ని లాగుతున్నారు. ఈకార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. ఆ రథం దాదాపు.. 120 అడుగుల  ఎత్తులో ఉన్నట్లు తెలుస్తొంది. బెంగళూరు (రూరల్)లోని హుస్కూర్ మద్దూరమ్మ దేవాలయం జాతర సందర్భంగా జరిగిన సంఘటన పెను సంచలనంగా మారింది.ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. 

బెంగళూరు (గ్రామీణ)లోని అనేకల్ సమీపంలో మతపరమైన,  సాంస్కృతిక కార్యక్రమంలో శనివారం 120 అడుగుల ఎత్తైన ఆలయ రథం కూలిపోయింది. హుస్కూర్ మద్దూరమ్మ ఆలయ వార్షిక జాతరలో 10 గ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులు పాల్గొంటుండగా ఈ ఘటన జరిగింది. వందలాది మంది భక్తులు భారీగా, అలంకరించబడిన రథాన్ని అన్ని వైపులా కట్టివేయబడిన తాళ్ల సహాయంతో పైకి లేపడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆరథం కాస్త అది బ్యాలెన్స్ కోల్పోయి నేలమీద పడింది. దీంతో అక్కడున్న వారంతా భయంతో దూరంగా పరుగులు పెట్టారు.

Read More: Snakes: ఇదేం విడ్డూరం.. పాముల్ని పెంచుకుంటున్న గ్రామస్థులు.. హనీ కలిగిస్తే అరెస్ట్ చేస్తారంట..

ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అనంతరం ట్రాక్టర్లు, ఎద్దుల బండ్ల సాయంతో రథాన్ని యథాస్థానానికి చేర్చారు. కాగా, హుస్కూర్ మద్దురమ్మ జాతర ప్రసిద్ధ వార్షిక రథోత్సవం, ఇక్కడ ఈ రథాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఒక దశాబ్దం క్రితం వరకు, వందకు పైగా రథాలు ప్రసిద్ధ ఉత్సవాన్ని అలంకరించేవి, అయితే ఇటీవలి సంవత్సరాలలో ఈ సంఖ్య కేవలం 10 నుండి 15కి పడిపోయింది. ఈఘటన జరగటం పట్ల భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News