Venu Swamy : విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదలైంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో హిట్ అవలేకపోయింది. రోజు రోజుకి తగ్గిపోతూ వస్తున్న చిత్ర కలెక్షన్స్ చూసి రౌడీ ఫాన్స్ కూడా అని నిరాశ చెందుతున్నారు.
తాజాగా సెలబ్రిటీల జ్యోతిష్యాలు చెబుతూ ఇండస్ట్రీలో పాపులర్ అయిన వేణు స్వామి ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా మీద కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వైరల్ అయ్యే వేణు స్వామి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గుంటూరు కారం, ఫ్యామిలీ స్టార్ సినిమాల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా ఫెయిల్ అవ్వడానికి అదే కారణం అంటూ మండి పడ్డారు. "మీరు నమ్మినా నమ్మకపోయినా సరే గుంటూరు కారం సినిమాను కావాలనే ఫేక్ రివ్యూస్ పెట్టి సినిమా ఫ్లాప్ అని చూపించారు. గుంటూరు కారం దాకా ఎందుకు అసలు నిన్న కాక మొన్న విడుదలైన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా విషయం లో కూడా అదే చేశారు" అన్నారు వేణు స్వామి.
"రిలీజ్ కాకముందే సినిమా బేకార్ గా ఉంది అంటూ ఫేక్ రివ్యూలు పెట్టేశారు. ట్రోల్స్, మీమ్స్, ఫేక్ రివ్యూలకి విజయ్ దేవరకొండ కెరియర్ నాశనమైపోయింది. అసలు సినిమా డిజాస్టర్ అవ్వడానికి కారణం ఈ ఫేక్ రివ్యూలే. సినిమా బయటికి రాకమందే బాలేదు, రాడ్డు దింపాడు అని రివ్యూలు ఎలా పెట్టేసారు?" అని నిలదీశారు వేణు స్వామి.
"ఈ పబ్లిసిటీ చూసి సినిమా చూడాలి అనుకున్న వాడు కూడా పోడు" అని వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా గతంలో విజయ్ దేవరకొండ జాతకం ఎలా ఉండబోతుంది అని కూడా వేణు స్వామి పలు మార్లు వివాదాస్పద కామెంట్లు చేశారు. కెరీర్ పరంగా విజయ్ దేవరకొండ జాతకం అంత గొప్ప గా ఉండదు అని, అల లాగా అంతెత్తు కి లేచి తుస్సు మని పడిపోతుంది అని విజయ్ ది ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండే జాతకం కాదు అని వేణు స్వామి అన్నారు.
అయితే సినిమా బాగాలేదు అని ఫేక్ రివ్యూస్ ఇస్తున్నారు అని వేణు స్వామి తో పాటు దిల్ రోజు కూడా పలుమార్లు మీడియా ముందు చెప్పారు. ఏదేమైనా విజయ్ దేవరకొండ కెరియర్లో ఈ సినిమా మరొకటి డిజాస్టర్ గా మారింది.
Also Read: Pawan Kalyan: జగన్‌లాంటి 'కోడిగుడ్డు' ప్రభుత్వం ఇంకా కావాలా? పవన్ కల్యాణ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook