Game Changer : గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ.. రామ్ చరణ్ ఏమన్నారంటే!

Ram Charan: ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రాబోతున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా విడుదల తేదీ మాత్రం వాయిదా పడుతూనే వస్తోంది.. ఇక ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు హీరో రామ్ చరణ్

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 14, 2024, 03:27 PM IST
Game Changer : గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ.. రామ్ చరణ్ ఏమన్నారంటే!

Game Changer Release Date:
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ తదుపరి చిత్రాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఆ చిత్రం అయిన వెంటనే తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో చిన్న అతిధి పాత్రలో.. కనిపించాడు రామ్ చరణ్. అయితే ఈ సినిమా ఘోర పరాజయం చవిచూసింది. కానీ ఈ సినిమాలో రామ్ చరణ్ అసలు హీరో కాకపోవడంతో ఆ ప్రభావం అయితే ఈ హీరో కెరియర్ పైన పడలేదు. ఇక రాజమౌళి చిత్రం తరువాత రామ్ చరణ్ ఫుల్ లాంటి హీరోగా రాబోతున్న సినిమా గేమ్ చేంజర్.

దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించడం విశేషం. ఈ చిత్రంపై అంచనాలు మొదటి నుంచి భారీగానే ఉన్నాయి. అయితే ఈ సినిమా ఎన్నో సంవత్సరాలపాటు ఆలస్యం అవుతూ వస్తూ ఉండటంతో ఆ అంచనాలు కాస్త నీరుకారిపోతున్నాయి. రామ్ చరణ్ అభిమానులు సైతం ఈ సినిమా విడుదల తేదీ గురించి క్లారిటీ రాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర విడుదల తేదీ గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు రామ్ చరణ్.

రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్ అందుకున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ చెన్నైలోని వేల్స్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. కాగా ఈ స్నాతకోత్సవంలో రామ్‌ చరణ్‌ ముఖ్య అతిథిగా హాజరై అలాగే మిగతా పరిశోధక విద్యార్థులతో కలిసి డాక్టరేట్ అందుకున్నాడు. 

ఈ క్రమంలో ఈ ప్రోగ్రాం లో మాట్లాడిన రామ్ చరణ్ గేమ్ చేంజ్ గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ మాట్లాడుతూ“నేను మొదటిసారి ఒక పొలిటికల్ థ్రిల్లర్ చేస్తున్నాను. దర్శకుడు శంకర్ గారు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ లేదా అక్టోబర్ చివరిలో రిలీజ్ అవుతుంది. మొత్తం ఐదు భాషల్లో సినిమా రిలీజ్ చెయ్యాలని చూస్తున్నాం” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ వార్త విన్నప్పుడు నుంచి రామ్ చరణ్ ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నాడు.

కాగా ఈ సినిమా నిర్మాత ఈ చిత్రాన్ని దివాళీ కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకు రావాలని ఫిక్స్ అయ్యారట. అక్టోబర్ 31న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి దిల్ రాజు ప్రయత్నిస్తున్నట్టు వినికిడి. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, సునీల్, ఎస్ జె సూర్య తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు.

Also Read: తెలుగు నేలతో బాబా సాహెబ్ అంబేద్కర్ అనుబంధం..

Also Read: ఖమ్మం పాలిటిక్స్ లో కీలక పరిణామం.. భట్టి, తుమ్మల ఏకమై.. పొంగులేటికి చెక్..?

 

 

 

 

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News