Chrysanthemum Tea: చాలామంది ఉదయం లేవగానే రోజుని టీతో ప్రారంభిస్తారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు రోజుల్లో ఒకసారైనా టీ ని తాగకుండా ఉండలేరు. ముఖ్యంగా ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసే వారి విషయానికొస్తే రోజులు కనీసం నాలుగు నుంచి ఐదు సార్లు అయినా తాగుతూ ఉంటారు. ఇలా ప్రతిరోజు పాలతో తయారు చేసిన టీని తాగడం వల్ల భవిష్యత్తులో అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే దీనికి బదులుగా అనేక ఆరోగ్య గుణాలు కలిగిన గ్రీన్ టీ లేదా చామంతి టీని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. నిజానికి గ్రీన్ టీలో కంటే ఎక్కువగా చామంతి టీలో పోషకాలు లభిస్తాయి కాబట్టి ఈ టీ ని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభించడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయి.
మన పూర్వీకులు చామంతి పువ్వులను ఎండలో ఎండబెట్టి వాటిని పొడిలా తయారు చేసుకుని ఎక్కువగా టీగా తీసుకునే వారట. ముఖ్యంగా అనారోగ్య సమస్యల బారిన పడేవారు ఈ టీని ప్రతిరోజు రెండు నుంచి మూడుసార్లు తాగేవారని సమాచారం. నిజానికి ఇందులో ఉండే కొన్ని ఆయుర్వేద గుణాలు క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధి నుంచి కూడా సులభంగా మన శరీరాన్ని రక్షిస్తాయి. కాబట్టి ఈ టీని ప్రతిరోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే ప్రతిరోజు చామంతి టీ ని తాగడం వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా ఈ చామంతి టీని తాగడం వల్ల పురుషుల కంటే మహిళలకే ఎక్కువగా లాభాలు కలుగుతాయి ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి ఇతర సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా పొట్టను కూడా ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు ఒత్తిడి వంటి సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయపడతాయి. కాబట్టి తరచుగా ఒత్తిడికి లోనవుతున్న వారు ప్రతిరోజు ఒకటి లేదా రెండుసార్లు ఈ టీని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
అలాగే ఈ చామంతిని తీసుకోవడం వల్ల మధుమేహం కూడా రాకుండా ఉంటుంది. ఇప్పటికే మధుమేహం సమస్యలతో బాధపడుతున్న వారు ఈ టీని తీసుకోవడం వల్ల సులభంగా రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీరంపై వచ్చే వాపులను తగ్గించేందుకు కూడా సహాయపడతాయి. అలాగే నిద్రలేమి సమస్యలతో బాధపడే వారికి కూడా ప్రభావవంతంగా సహాయపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు. నిద్రలేని సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు పడుకునే గంట ముందు ఈ టీని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి