ఆ ఒక్క విషయంలో కేసీఆర్ పాలనను మెచ్చుకున్న రాహుల్ !!

తాండూరులో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారసభలో కేసీఆర్ పాలనపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Last Updated : Dec 3, 2018, 04:25 PM IST
ఆ ఒక్క విషయంలో కేసీఆర్ పాలనను మెచ్చుకున్న రాహుల్ !!

వికారాబాద్: తాండూరులో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారసభలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఉద్వేగంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ కుటుంబ పాలన అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ అని పదే పదే చెబుతున్న కేసీఆర్ ఆచరణలో చూపించలేపోయారు. ఈ నాలుగేళ్లలో ఒకటి మాత్రం సాదించారు. ఎన్నికల ముందు సాధారణ కుటుంబంగా ఉన్న తన కుటుంబాన్ని బంగారు కుంటుంగా తీర్చదిద్దారు. ఈ విషయంలో కేసీఆర్ పాలనను మెచ్చుకోవాలని రాహుల్ ఎద్దేవ చేశారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఆస్తులు ఈ నాలుగేళ్లలో 400 శాతం పెరిగడమే ఇందుకు నిదర్శనమన్నారు

కేసీఆర్ ప్రజలను కించపరుస్తున్నారు..
కేసీఆర్ మాట తీరు చూస్తుంటే.. తెలంగాణ ప్రజలు తెలివి తక్కువగా వాళ్లుగా భావిస్తారు. తన మాటలను ప్రజలు సరిగా అర్థం చేసుకోరని సభా వేధికపైనే కేసీఆర్ చిరాకుపడుతున్నారు. ప్రజల పట్ల ఆయన ఎలాంటి చులకన భావనఉన్నారో ఈ మాట తీరుతో అర్థం చేసుకోవచ్చుని రాహుల్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రంగానలను క్షుణ్ణంగా గమనిస్తే ఈ విషయంలో ఎవ్వరికైనా అర్థమౌతుందన్నారు. కేసీఆర్ ను నమ్మి ఓటు వేసిన ప్రజలను అమాయకులుగా చిత్రీకరిస్తున్నారని.. ఓట్లు వేసిందనుకు అభిమానించాల్సింది పోయి తెలగాణ ప్రజలను చులకనగా చూస్తున్నారు.. కేసీఆర్ తీరును ప్రజలు వారి సత్తా ఏమిటో ఎన్నికల సయయంలో చూపిస్తారని  రాహుల్ ఈ సందర్భంగా వెల్లడించారు

ఆదర్శ రాష్ట్ర అప్పుల రాష్ట్రంగా తయరైంది
భూమి, నీరు, ఉద్యోగాల ఆత్మగౌరవంపై కలగన్నారు..ఈ కలను సాకారం చేసుకోవడానికి పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నారు. తీరా తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలు ఆశలు ఆంకాంక్షలు కలగానే మిగిలిపోయాయి.  తాము కూడ తెలంగాణ ప్రదేశం ఇస్తే మిగిలిన రాష్ట్రాలకు ఇది ఆదర్శవంతంగా మరుతుందని అనుకున్నాం.. రాష్ట్రం ఇస్తే యువకులకు ఉపాధి వస్తుందని, రైతులు, మహిళలకు మంచి భవిష్యత్తు వస్తుందని భావించాం..కానీ ఇవన్నీ జరగలేదని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ప్రాజెక్టును రీ డైజన్ చేస్తూ ప్రాజెక్టుల వ్యయం పెంచుకుంటూ కాంట్రాక్టుదారులకు లబ్ది చేకూర్చారు. కేసీఆర్ హయంలో 50 వేల ప్రాజెక్టులను 90 వేలకు పెంచేశారు. రంగారెడ్డి లలోని  10 వేల ప్రాజెక్టును 60 వేలు పెంచేశారు. తెలంగాణ రాష్ట్ర అవిర్భారవం సమయంలో 17 వేల మిగులు బడ్జెట్ ఉండేది. కానీ ఇప్పడు ప్రతీకుటుంబంపై 2.5 లక్షల అప్పు ఉందని రాహుల్ గాంధీ విమర్శించారు

 

Trending News