Actor Mirzapur Pankaj Tripathi Brother in law Died in Road Accident: బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన బావ రాకేష్ తివారీ, భార్యతో కలిసి ప్రత్యేక వాహానంలో డ్రైవింగ్ చేస్తూ వెస్ట్ బెంగాల్ లోని గోపాల్ గంజ్ కు బయల్దేరారు. కారును వేగంగా నడిపిస్తున్నారు. ఈక్రమంలో అది చౌరస్తా కూడలి దగ్గర అదుపులోకి రాలేదు. దీంతో ఆయన కారు వేగంగా వెళ్లి డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైపోయింది. కారులో నుంచి బైటకు వచ్చిపడినట్లు తెలుస్తోంది. మున్నా తివారి తలకు బలమైన గాయాలు కావడం వల్ల ఆయన స్పాట్ లోనే చనిపోయారు. కారులోనే ఉన్న త్రిపాఠి సోదరి సబితా తివారి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
धनबाद में पंकज त्रिपाठी की बहन जीजा की कार का एक्सिडेंट...
एक्सीडेंट का CCTV फुटेज#dhanbad #pankajtripathi #car #accident pic.twitter.com/Mwza3mzcsO— Monikaa Jaiswal (@monikajaiswal_) April 20, 2024
వెంటనే ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీ-కోల్‌కతా జాతీయ రహదారి-2లోని నిర్సా బజార్ వద్ద సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో దంపతులు ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారి తెలిపారు.కాగా, బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా నుంచి పశ్చిమ బెంగాల్‌కు బయలుదేరారు.
ధన్‌బాద్‌లోని షాహిద్ నిర్మల్ మహ్తో మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (SNMMCH)లో రాకేష్ తివారీ మరణించినట్లు ప్రకటించారు. సబితా తివారికి కాలు ఫ్రాక్చర్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. త్రిపాఠి సోదరి ప్రాణాపాయం నుంచి బయటపడిందని SNMMCH ఎమర్జెన్సీ HOD డాక్టర్ దినేష్ కుమార్ గిందౌరియా తెలిపారు. ఈ ఘటనతో మీర్జాపూర్ నటుడు పంకజ్ త్రిపాఠి, ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురైనట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter