Bajaj Platina 110 Price: ఎప్పటి నుంచో అతి తక్కువ ధరలోనే ఎక్కువ మైలేజీని ఇచ్చే 110 సిసి బైక్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ప్రముఖ మోటర్ సైకిల్ కంపెనీ బజాజ్ ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ చేసిన కొత్త ప్లాటినా 110 బైక్ మంచి ఎంపికగా భావించవచ్చు. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో పాటు అద్భుతమైన మైలేజీతో అందుబాటులోకి వచ్చింది. అయితే బజాజ్ ఈ మోటర్ సైకిల్‌పై ప్రత్యేమైన ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. దీనిని ఇప్పుడే కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.80 వేల లోపే పొందవచ్చు. అయితే ఈ బైక్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్, ధర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శక్తివంతమైన ఇంజన్‌తో మంచి మైలేజీ:
బజాజ్ ప్లాటినా 110సిసి బైక్‌ను కంపెనీ శక్తివంతమైన ఇంజన్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది 115.45 సిసి ఎయిర్-కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ని కలిగి ఉంటుంది. అలాగే ఈ ఇంజన్ 8.6 PS పవర్‌తో పాటు 9.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో పాటు 5-స్పీడ్ గేర్‌బాక్స్ సెటప్‌తో అందుబాటులోకి రావచ్చింది. ఈ బైక్ దాదాపు కేవలం ఒక్క లీటర్ పెట్రోల్‌కి 70 కిలోమీటర్లకు పైగా మైలేజీని ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.
భద్రత ఫీచర్:
ఇక ఈ బైక్‌కి సంబంధించి సెఫ్టీ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. బజాజ్ ప్లాటినా 110 సిసి అద్భుతమైన భద్రతా ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది ఫ్రంట్ వీల్ డిస్క్ బ్రేక్ సెటప్‌తో సింగిల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)ని కలిగి ఉండబోతున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్ ఎలాంటి రోడ్లపైన అయిన టైర్స్ స్కిడ్ కాకుండా ఉంటాయి. అలాగే బ్యాక్ టైర్స్‌కి కంపెనీ డ్రమ్ బ్రేక్‌ను అందుబాటులో ఉంచింది. అలాగే కంపెనీ ఈ బైక్‌లో ప్రత్యేకమైన సీట్ సెటప్‌తో విడుదల చేసింది. దీంతో సుదీర్ఘ ప్రయాణాల్లో కూడా మీకు సౌకర్యాన్ని అందిస్తుంది. దీంతో పాటు ఈ మోటర్ సైకల్ ఫ్రంట్‌లో టెలిస్కోపిక్ సస్పెన్షన్, డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్స్‌ను కలిగి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఆకర్షణీయమైన లుక్:
బజాజ్ ప్లాటినా 110 సిసి ఎంతో ప్రత్యేమైన లుక్‌లో అందుబాటులోకి వచ్చింది. అలాగే గతంలో లాంచ్ చేసిన ప్లాటినా కంపెనీ ఇది ప్రత్యేకమై లుక్‌లో హెడ్‌లైట్, టెయిల్‌లైట్, డిజిటల్ స్పీడోమీటర్, అల్లాయ్ వీల్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇక ఈ బైక్ ధర వివరాల్లోకి వెళితే, ఇది హైదరాబాద్ లోకేషన్లో ఎక్స్-షోరూమ్ ధర రూ.70,778 నుంచి ప్రారంభమవుతుంది. అన్ని రకాల ట్యాక్సులు పోను ఈ మోటర్ సైకిల్ ధర రూ. 88,779లకే లభిస్తోంది. ప్రస్తుతం ఇది బ్లాక్ గ్లాస్, ట్యూటర్ గ్రే, కాక్టెయిల్ విండ్ రెడ్, సఫైర్ బ్లూ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి