హంగ్ వస్తే ...: టీఆర్ఎస్.. మహాకూటమి ముందున్న ఆప్షన్స్ ఇవే

గెలుపు ఓటములు విషయాన్ని పక్కన పెట్టిన నేతలు... హంగ్ వస్తే ఏం చేయాలనే దానిపై ప్రధానంగా దృష్టి సారించారు.

Last Updated : Dec 11, 2018, 06:51 AM IST
హంగ్ వస్తే ...: టీఆర్ఎస్.. మహాకూటమి ముందున్న ఆప్షన్స్ ఇవే

సర్వేల్లో ఒక వర్గం టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని చెబుతుంటే..మరోక వర్గం మాత్రం మహాకూటమిదే గెలుపు తథ్యమంటోంది. అయితే  పార్టీలు మాత్రం వీటికి భిన్నంగా హంగ్ దిశగా ఆలోచన చేస్తున్నాయి. గెలుపోటముల ఈక్వేషన్స్ పక్కన పెట్టి..అసలు హంగ్ వస్తే ఏం చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాన వర్గమైన మహాకూటమి, టీఆర్ఎస్ తమ ముందున్న ఆప్షన్స్ పై దృష్టి సారించాయి..

మహాకూటమి ముందన్న ఆప్షన్స్ ఇవే...
రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే ఏంచేయాలనే దానిపై మహాకూమి నేతలు దృష్టి సారించారు. ఈ విషయంలో వారి ముందు ఒక ఆప్షన్.. ఇండిపెండెంట్లను దగ్గరకు తీసుకోవడం..మరో ఆప్షన్ ఎంఐఎం పార్టీ మద్దతు తీసుకోవడం. బీజేపీ ఎలాగూ కాంగ్రెస్ కు  మద్దతు ఇవ్వదు..ఇచ్చినా మహాకూటమి సచ్చినా  మద్దతు తీసుకోబోదు..కాబట్టి ఈ మూర్గం మూసుకొని పోయినట్లే. ఈ క్రమంలో కచ్చితంగా గెలుస్తారనే టాక్ వినిస్తున్నఇండిపెండెట్లను మహాకూటమి నేతలు మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ఇప్పటి నుంచే ప్రారంభించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  దీంతో పాటు ఎంఐఎం నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫలితాలు ఎటూ తేలక... గత్యంతరం లేని పరిస్థితులు వస్తే కర్నాటక తరహా రాజకీయం నడిపి ఎంఐఎం ముందు భారీ ఆఫర్ ఉంచేందుకు కాంగ్రెస్  సిద్ధంగా ఉన్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి.

టీఆర్ఎస్ ముందన్న ఆప్షన్స్ ఇవే...
మహాకూటమికి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయో.. అలాంటి తరహా ఆప్షన్స్ టీఆర్ఎస్ ముందు ఉన్నాయి.  ఎలాగు ఆ పార్టీకి ఎంఐఎం మిత్రపక్షమైనందున ..ఒక ఆప్షన్ ఇండిపెండంట్లతో దోస్తీ చేయడం... మరో ఆప్షన్ బీజేపీ మద్దతు తీసుకోడం. అయితే బీజేపీతో మద్దతు తీసుకుంటే ఎంఐఎం ఊరుకోదు..పైగా బీజేపీతో దోస్తీ కోసం ముందుకు వెళితే ఎంఐఎం పార్టీ మహాకూటమి వైపు మొగ్గు చూపుతుంది. కాబట్టి బీజేపీ ఆప్షన్ ను హోల్డ్ లో పెట్టి ప్రస్తుతం కల్చితంగా గెలుస్తారనే ఇండిపెండెట్లను గుర్తించి వారి మద్దతు కోసం టీఆర్ఎస్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ మద్దతు అనివార్యమైతే  టీఆర్ఎస్..ఆ పార్టీ మద్దతు తీసుకోనే విషయంలో వెనుకాడబోదనే విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇండిపెండెంట్లకు యమ డిమాండ్
ఆంధ్రా ఆక్టోపస్ చెప్పినట్లుగా ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు గనుకా ఎక్కువ సీట్లు సాధిస్తే వాళ్ళకు యమ డిమాండ్ ఏర్పడుతుంది. ఇప్పుటికే అటు టీఆర్ఎస్..మరియు మహాకూటమి నేతలు కచ్చితంగా గెలుస్తారనే ఇండిపెండెట్ అభ్యర్ధులను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో ఇరుపార్టీలకు చెందిన అగ్రనేతలు రంగంలోకి దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హంగ్ ఏర్పడితే ఇండిపెండట్లు ఎవరికి మద్దతు ఇస్తారనే దానిపై కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది.

 

Trending News